జ్యుడిషియల్‌ ప్రివ్యూ లోగో, వెబ్‌సైట్‌ను ప్రారంభించిన సీఎం జగన్

By Siva Kodati  |  First Published Oct 7, 2019, 3:51 PM IST

జ్యుడిషియల్‌ – ప్రివ్యూ యొక్క అధికారిక లోగో మరియు వెబ్‌సైట్‌ను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సోమవారం ప్రారంభించారు. 


జ్యుడిషియల్‌ – ప్రివ్యూ యొక్క అధికారిక లోగో మరియు వెబ్‌సైట్‌ను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సోమవారం ప్రారంభించారు.

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా రూపొందించిన చట్టం ఆంధ్రప్రదేశ్‌ మౌలిక సదుపాయముల (న్యాయపరమైన ముందు సమీక్ష ద్వారా పారదర్శకత), 2019 చట్టము 14.08.2019 నుండి అమలులోకి వచ్చినది.

Latest Videos

ఈ చట్టమును అనుసరించి న్యాయపరమైన ముందు సమీక్ష ద్వారా రాష్ట్రములో మౌలిక సదుపాయముల టెండర్  ప్రక్రియలో పారదర్శకతను తీసుకువస్తోంది.

దానితో పాటు ప్రభుత్వ వనరులను అనుకూలమైన విధముగా వినియోగించుకొనేటట్లు చూడడానికి మరియు అందుకు సంబంధించిన లేదా అనుషంగికమైన విషయముల కొరకు ఉపయోగపడుతుంది.

ఈ చట్టమును అనుసరించి, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రము నందలి ప్రభుత్వ ఏజెన్సీ లేదా స్ధానిక అధికారి, 100 కోట్ల రూపాయలు మరియు అంతకుమించిన మౌలికసదుపాయముల ప్రాజెక్టులకు సంబంధించి టెండరుకు సంబంధించిన పత్రములన్నింటిని న్యాయపరమైన ముందు సమీక్షకు గౌరవ న్యాయమూర్తి గారికి సమర్పించవలెను.

లోగో, వెబ్‌సైట్ ఆవిష్కరణ కార్యక్రమంలో జ్యూడీషియల్ ప్రివ్యూ న్యాయమూర్తి జస్టిస్ శివశంకరరావు, సీఎస్ ఎల్వీ సుబ్రమణ్యం, సీఎం ప్రిన్సిపల్ అడ్వైజర్ అజేయ కల్లం తదితరులు పాల్గొన్నారు. 

click me!