గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో కృష్ణా జిల్లాలోని మచిలీపట్నంలో లోతట్టుప్రాంతాలు నీటమునిగాయి.
మచిలీపట్నం: గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో కృష్ణా జిల్లాలోని మచిలీపట్నంలో లోతట్టుప్రాంతాలు నీటమునిగాయి. దాదాపు పట్టణంలోని ప్రధాన రహదారులన్నీ నీటమునిగాయి. బందర్ బస్టాండ్ పరిస్థితి మరీ అధ్వానంగా తయారయ్యింది. వర్షం కురిస్తే చాలు ప్రయాణికులకు తీవ్ర ఇబ్బంది చవిచూస్తున్నారు. అలాగే రహదారులు, కాలనీల్లో మోకాల్లోతే నీరు నిలిచి చెరువులను తలపిస్తున్నాయి. పట్టణ డ్రైనేజీ వ్యవస్థ సరిగా లేకపోవడం వల్లే చిన్నపాటి వానకే జనజీవ చిత్తడి చిత్తడి గా మారుతుంది.
వీడియో