విజయవాడలో దారుణం...నడిరోడ్డుపై పట్టపగలు కత్తులతో దాడి (వీడియో)

Arun Kumar P   | Asianet News
Published : Sep 07, 2020, 01:29 PM ISTUpdated : Sep 07, 2020, 02:35 PM IST
విజయవాడలో దారుణం...నడిరోడ్డుపై పట్టపగలు కత్తులతో దాడి (వీడియో)

సారాంశం

 పట్టపగలే నడిరోడ్డుపై ఓ వ్యక్తిపై మరో వ్యక్తి కత్తితో దాడికి పాల్పడిన దారుణ సంఘటన విజయవాడలో చోటుచేసుకుంది.

విజయవాడ: పట్టపగలే నడిరోడ్డుపై ఓ వ్యక్తిపై మరో వ్యక్తి కత్తితో దాడికి పాల్పడిన దారుణ సంఘటన విజయవాడలో చోటుచేసుకుంది. టూటౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సుబ్రహ్మణ్య స్వామి గుడి సమీపంలో ఈ హత్యాయత్నం జరిగింది. బైనేని సాయి అనే వ్యక్తిని ఈశ్వర్ అనే దుండగుడు కత్తితో దాడి చేశాడు. విచక్షణారహితంగా కత్తితో ఒళ్లంతా పొడవడంతో సాయి తీవ్ర గాయాలపాలై రక్తపు మడుగులో పడిపోయాడు. 

ఈ హత్యాయత్నంపై సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిని సంఘటనా స్థలానికి చేరుకున్నారు. కొన ఊపిరితో ఉన్న బాధితుడిని ఆసుపత్రికి తరలించారు. అనంతరం ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. ప్రస్తుతం నిందితుడు పరారీలో వున్నట్లు... అతడి కోసం గాలింపు చేపట్టినట్లు కొత్తపేట పోలీసులు వెల్లడించారు. 

వీడియో

"

PREV
click me!

Recommended Stories

సంక్రాంతికి వారం రోజులు సెల‌వులు.. ఎప్పటి నుంచి ఎప్ప‌టివ‌ర‌కు అంటే..?
హెచ్‌ఐవీ రోగుల సంఖ్యలో రెండో స్థానంలో ఆంధ్రప్రదేశ్‌