ఓ వైపు ప్రభుత్వం మద్యపాన నిషేధాన్ని అమలు చేసేందుకు ప్రయత్నిస్తుంటే కొందరు మాత్రం నాటుసారా అమ్మకాలను జోరుగా సాగిస్తున్నారు. కృష్ణా జిల్లా విస్సన్నపేట మండలం నరసాపురం గ్రామంలో నాటు సారా విక్రయిస్తున్న వ్యక్తిని గ్రామ వాలంటీర్లు పట్టుకున్నారు
ఓ వైపు ప్రభుత్వం మద్యపాన నిషేధాన్ని అమలు చేసేందుకు ప్రయత్నిస్తుంటే కొందరు మాత్రం నాటుసారా అమ్మకాలను జోరుగా సాగిస్తున్నారు. కృష్ణా జిల్లా విస్సన్నపేట మండలం నరసాపురం గ్రామంలో నాటు సారా విక్రయిస్తున్న వ్యక్తిని గ్రామ వాలంటీర్లు పట్టుకున్నారు.
అతని వద్ద నుంచి 20 లీటర్లకు పైగా నాటుసారాను స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా గ్రామ వాలంటీర్లను గ్రామస్తులు అభినందించారు.
మరోవైపు ఆంధ్రప్రదేశ్‌లో నూతన మద్యం విధానాన్ని అక్టోబర్ 1 నుంచి అమల్లోకి తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. ప్రభుత్వం నిర్వహణలో మద్యం దుకాణాలు కొనసాగుతున్నాయి.
రాష్ట్రవ్యాప్తంగా 3,500 మద్యం దుకాణాలు ఏర్పాటు చేశారు. వీటి ద్వారా 3,500 సూపర్‌వైజర్లు, 8,033 సేల్స్‌మెన్ ఉద్యోగాలను ఏర్పాటు చేశారు.