ఎన్నికల హామీలన్ని పూర్తయినట్లే...మిగిలింది అదొక్కటే: మల్లాది విష్ణు

By Arun Kumar P  |  First Published Dec 14, 2019, 4:03 PM IST

విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై ప్రశంసల జల్లు కురిపించారు. అధికారాన్ని చేపట్టిన ఏడు నెలల కాలంలోనే ప్రకటించిన  అన్ని హామీలను పూర్తిచేసినట్లు తెలిపారు. 


విజయవాడ: రాష్ట్రంలో వైస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏర్పడి కేవలం ఏడు నెలలే అవుతోందని... ఇంత తక్కువ పాలనకాలంలో ఎన్నికల హామీలు పూర్తి స్థాయిలో నిరవేర్చామని ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. ఇప్పటికే ప్రవేశపెట్టిన అనేక  అభివృద్ది, సంక్షేమ పథకాలకు జనవరి9 నుండి అమ్మఒడి పథకం యాడ్ కానుందని...దీంతో ఎన్నికల సమయంలో ప్రకటించిన అన్ని హామీలు పూర్తి అవుతాయని విష్ణు పేర్కోన్నారు. 

విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ పార్టీ కార్యాలయంలో ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... గత టిడిపి ప్రభుత్వ పాలనలో  జరిగిన శాసనసభ సమావేశాల్లో ఎన్నిక హామీలు, ప్రజల సమస్యల గురించి ఒక్కసారీ చర్చించలేకపోయారని అన్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి అధికారం చేపట్టాక జరిగిన  మొదటి సమావేశాల్లోనే 19 బిల్లు ఆమోదం పొందాయన్నారు.

Latest Videos

undefined

చరిత్రలో ఎన్నడూ లేని విధంగా బడుగు బలహీన వర్గాలకు ప్రభుత్వం పెద్ద పీట వేస్తోందన్నారు. చంద్రబాబు నాయుడు ఈవారం రోజులపాటు సాగిన శాసనసభ సమావేశాలను స్తంభింపచేయాలని చూశారని ఆరోపించారు. ప్రభుత్వం అందించే సంక్షేమ ఫలాలు ప్రజలకు చెరకుండా చేస్తున్నారని ఆరోపించారు. వైసిపి అధినేత, సీఎం జగన్ ను ఆశీర్వదిస్తూ ప్రజలు ఇచ్చిన 151 సీట్ల ప్రజా తీర్పును చంద్రబాబు  ఓర్వలేకపోతున్నారని అన్నారు.

read more విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు కుట్రలు... వైసిపి నేత సంచలనం

దిశ చట్టంపై చర్చ జరగాలంటే ఉల్లి గురించి రాద్దాంతం చేయాలని చూసారని మండిపడ్డారు. తమ ప్రభుత్వం ఇప్పటికే ప్రజలకు ఉల్లి కొరత తీర్చేలా చర్యలు చేపట్టిందన్నారు. ప్రజల ఇబ్బందులను గుర్తించి కేజీ ఉల్లి 25 రూపాయలకే అందుబాటులో ఉంచామన్నారు. 

ఇంగ్లీషు విద్య, అమ్మ ఒడి, నాడు నేడు, రివర్స్ టెండరింగ్.. అన్నింటిలోనూ చంద్రబాబు అడ్డుపడుతున్నారని ఆరోపించారు. ప్రజా సమస్యలపై చర్చించాలని ప్రభుత్వం చూస్తుంటే చంద్రబాబు రాజకీయం చేయాలని చూస్తున్నారని మండిపడ్డారు. 

ఎంతో అనుభవముందని  చెప్పుకునే చంద్రబాబు అసెంబ్లీలోనే ఉన్మాది, బస్టడ్ అంటూ విచక్షణ కోల్పోయి మాట్లాడుతున్నారని విమర్శించారు. ఇలా అసెంబ్లీలో ప్రతి పక్షం తీరు జుగుబ్సాకరంగా వుంటోందన్నారు. 

చంద్రబాబు పాలనలో ప్రజాస్వామ్యాన్ని,రాజ్యాంగ విధానాలను కూని చేశారని...దీంతో జలు తిరస్కరించినా ఆయన ప్రవర్తనలో ఎలాంటి మార్పు రాలేదన్నారు. సంక్షేమ కార్యక్రమాల్లో సీఎం పేదలకు పెద్దపీఠ వేస్తున్నారని అన్నారు. 

read more రాజధానిపై మాటమార్చిన బొత్స... అసెంబ్లీ నిర్ణయమే ఫైనల్

విద్య, వైద్య రంగాల్లో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టామన్నారు. నాడు నేడు కార్యక్రమంతో రాష్ట్రంలోని పాఠశాలకు రూ.3500 కోట్లతో మౌళిక సదుపాయాలు కల్పిస్తున్నామని వెల్లడించారు.ప్రజలు కోరుకునే పరిపాలన జగన్మోహన్ రెడ్డి అందిస్తున్నారని విష్ణు పేర్కొన్నారు. 

అసెంబ్లీ ఆవరణలో చంద్రబాబు  ప్రవర్తన భయానకంగా ఉందని... ఆయన హుందాగా వ్యవహరించి వుండాల్సిందన్నారు. రాష్ట్ర చరిత్రలో నిలిచిపోయే దిశా చట్టానికి సంబంధించిన బిల్లును శాసనసభలో ప్రవేశపెట్టే సయమంలో చంద్రబాబు అండ్ కంపెనీ బయటకు వెళ్లి పోయిందని గుర్తుచేశారు. ఇది వారికి మహిళా సంరక్షణపై ఎంత నిబద్దత వుందో తెలియజేస్తుందన్నారు. 

డిసెంబర్21న సీఎం జగన్మోహన్ రెడ్డి జన్మదినోత్స వేడుకలు ఘనంగా నిర్వహించనున్నట్లు విష్ణు వెల్లడించారు. ఆ రోజు బిఆర్‌టిఎస్ రోడ్డు నుంచి పైపుల రోడ్ వరకు వైసిపి ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రదర్శన చేస్తామన్నారు. నియోజకవర్గంలోని 20 డివిజన్లలో ఈ కార్యక్రమం చేపడుతున్నామని... ప్రభుత్వం నుంచి లబ్ధి పొందిన   వారందరూ ఆహ్వనితులేనని విష్ణు ప్రకటించారు. 

 

click me!