వసంత కుంటుబానివి హత్యా రాజకీయాలు...ఈ రెండింటి వెనక...: దేవినేని ఉమ

Arun Kumar P   | Asianet News
Published : Feb 25, 2020, 05:39 PM ISTUpdated : Feb 25, 2020, 05:41 PM IST
వసంత కుంటుబానివి హత్యా రాజకీయాలు...ఈ రెండింటి వెనక...: దేవినేని ఉమ

సారాంశం

దేవినేని ఉమ, వసంత ఫ్యామిలీ  మధ్య మాటలయుద్దం కొనసాగుతోంది. తనపై ఇటీవల మాజీ హోమంత్రి వసంత నాగేశ్వరరావు, వైసిపి ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ లు చేసిన విమర్శలపై ఉమ తాజాగా స్పందించారు. 

విజయవాడ: కృష్ణా జిల్లా రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. మాజీ మంత్రులు దేవినేని ఉమామహేశ్వరరావు, వసంత నాగేశ్వర రావుల మధ్య మాటల యుద్దం కొనసాగుతోంది. నందిగామలోని అన్న క్యాంటీన్ ల వద్ద వంటావార్పూ కార్యక్రమంలో భాగంగా మాజీ హోంమంత్రి వసంత నాగేశ్వరరావు, ఆయన తనయుడు కృష్ణప్రసాద్ లపై విమర్శలు చేశారు. దీనిపై నాగేశ్వరరావు ఘాటుగా స్పందించి ఉమపై తీవ్ర పదజాలంతో విరుచుకుపడ్డారు. 

తాజాగా ఈ విమర్శలపై దేవినేని ఉమ స్పందించారు. నందిగామలో వసంత ఫ్యామిలీ హత్యారాజకీయాలు చేశారని... బినామీ ఆస్తుల కోసం పొదిలి రవిని చంపలేదా...   గుండె మీద చేయి వేసి చెప్పాలంటూ నిలదీశారు. 

read more  కరెంట్ తీగలు పట్టుకుని ప్రాణత్యాగానికి సిద్దమే...: దేవినేని ఉమకు మాజీ హోంమంత్రి సవాల్
 
''కుటుంబ సభ్యులను, పిల్లల్ని అందర్నీ తిడితే మంత్రి పదవులు వస్తాయా... గతంలో బాపట్లకు చెందిన మేరీ అనే మహిళ హైదరాబాద్ లోని మీ ఇంటిలో చనిపోయింది వాస్తవం కాదా... అప్పుడు పదవిలో ఉండి కేసును కప్పి పుచ్చింది వాస్తవమా కాదా... బ్రతికుండగానే కాళ్లకు జలగలు పెట్టుకున్నావు మీరు ఎంత పాపం చేశారు. మీ తండ్రి మాట్లాడిన పాపపు  మాటలు నీకు తగులుతాయి. విశాఖపట్నం లో భూములు అమ్ముకోవడం కోసం మూడు రాజధానల ఆటలు ఆడుతున్నారు'' అంటూ వసంత కృష్ణప్రసాద్ పై విరుచుకుపడ్డారు. 

PREV
click me!

Recommended Stories

సంక్రాంతికి వారం రోజులు సెల‌వులు.. ఎప్పటి నుంచి ఎప్ప‌టివ‌ర‌కు అంటే..?
హెచ్‌ఐవీ రోగుల సంఖ్యలో రెండో స్థానంలో ఆంధ్రప్రదేశ్‌