చంద్రబాబు అక్రమాస్తుల పిటిషన్ పై ఏసిబి కోర్ట్ విచారణ... హాజరైన లక్ష్మీపార్వతి

By Arun Kumar P  |  First Published Feb 7, 2020, 4:01 PM IST

ఆంధ్ర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు అక్రమాస్తులను కలిగివున్నాడంటూ వైసిపి నాయకురాలు లక్ష్మీపార్వతి ఏసిబి కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. దీనిపై శుక్రవారం కోర్టు విచారణ చేపట్టింది. 


అమరావతి: మాజీ  ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు భారీగా అక్రమాస్తులను సంపాందించాడంటూ వైఎస్సార్ కాంగ్రెస్ నాయకురాలు లక్ష్మీపార్వతి సిబిఐ కోర్టును ఆశ్రయించింది. అతడు ఇప్పటివరకు సంపాదించిన అక్రమాస్తులపై విచారణ చేపట్టాల్సిందిగా కోరుతూ ఏసిబి కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై కోర్టు శుక్రవారం విచారణ జరిపింది. 

ఏసిబి కోర్టు  ముందు ఇవాళ ప్రత్యక్షంగా హాజరయ్యారు లక్ష్మీపార్వతి. మాజీ ముఖ్యమంత్రిగా అధికారాన్ని అడ్డం పెట్టుకుని చంద్రబాబు భారీగా అక్రమాస్తులు కూడబెట్టాడని... ఆదాయానికి మించిన ఆస్తులు అతడు కలిగి ఉన్నాడని ఆమె ఆరోపించారు. ఆయన ఆస్తులపై సమగ్ర విచారణ జరిపించాలని లక్ష్మీ పార్వతి కోరారు.

Latest Videos

undefined

read more  రాయిటర్స్ సొంత పైత్యమే...: కియా మోటార్స్ తరలింపుపై బొత్స

చంద్రబాబు పై ఏసీబీ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరిపించాలని ఆమె కోరారు. చంద్రబాబుపై స్టేవెకేట్ అయిన వివరాలను కోర్టుకు సమర్పించిన లక్ష్మి పార్వతి. 1978 నుంచి 2005 వరకు చంద్రబాబుకు ఉన్న ఆస్తుల వివరాలను కోర్టుకు తెలిపిన ఆమె...

చంద్రబాబు నాయుడు ఆస్తుల సంబంధించిన కేసు రీజిస్టర్ కాకముందే హైకోర్టు నుండి స్టే ఎలా తెచుకున్నాడో తెలపాలన్నారు. మొదట ఎమ్మెల్యే గా 300 రూపాయలు తీసుకున్న చంద్రబాబు ఆ తర్వాత అక్రమంగా వేల కోట్ల రూపాయలు సంపాదించారన్నారు. చంద్రబాబు ఆస్తుల పై సమగ్ర విచారణ కు అదేశం ఇవ్వాలని ఏసీబీ కోర్టును ఆమె కోరారు. 

read more  మహిళల ఆగ్రహం... స్వరూపానంద సరస్వతికి తాకిన రాజధాని సెగ

అయితే హైకోర్టులో ఇప్పటికే ఈ కేసులో స్టే ఉందని సిబిఐ కోర్టుకు తెలిపారు చంద్రబాబు తరపు న్యాయవాది. హైకోర్టు స్టే వివరాలు పరిశీలిస్తామన్న ఏసీబీ కోర్ట్ తదుపరి విచారణను ఈ నెల 14వ తేదీకి వాయిదా వేసింది. 

 
 

click me!