చంచల్ గూడానా, ఎడారి జైలా...లేక జగన్ గతి పావురాల గుట్టేనా..: బుద్దా వెంకన్న

Arun Kumar P   | Asianet News
Published : Feb 24, 2020, 03:00 PM IST
చంచల్ గూడానా, ఎడారి జైలా...లేక జగన్ గతి పావురాల గుట్టేనా..: బుద్దా వెంకన్న

సారాంశం

ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్,, ఎంపీ విజయసాయి రెడ్డిలపై టిడిపి అధికార ప్రతినిధి, ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న ఫైర్ అయ్యారు. జగన్ మరోసారి జైలుకెళ్లడం ఖాయమంటూ  వెంకన్న వ్యాఖ్యానించారు. 

విజయవాడ: ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్, ఎంపీ విజయసాయి రెడ్డిలపై టిడిపి అధికార ప్రతినిధి, బుద్దా వెంకన్న మరోసారి ఫైర్ అయ్యారు. ముఖ్యంగా రస్ అల్ ఖైమా వ్యవహారంలో జగన్ కు మళ్లీ చిప్పకూడు తప్పదంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే ఆయన ఈసారి చంచల్ గూడ జైలుకా లేకా ఎడాది దేశంలోని జైలుకా లేక పావురాల గుట్ట పరిస్థితి వస్తుందా అన్నదే తేలాల్సివుందన్నారు. 

''రూ.6 లక్షల కోట్లు కుంభకోణం అని  వైఎస్ జగన్ గారు పుస్తకం రాయించారు. ఆ పుస్తకంలో ఉన్న 6 లక్షల కోట్లు వెతకడానికి తమిళనాడులోని కుంభకోణం వెళ్లి తప్పిపోయాడు విజయసాయి రెడ్డి గారు'' వెంకన్న ఎద్దేవా చేశారు.

''పార్టీలో A2 పదవి ఇవ్వకపోతే రాసిన దొంగ లెక్కలు బయటపెడతా అని జగన్ గారిని బెదిరించి పదవులు కొట్టేసిన మీలా అందరూ ఉంటారు అనుకుంటే ఎలా'' అని ఎంపీ విజయసాయి రెడ్డిని ప్రశ్నించారు.  

read more  చంద్రబాబుకు మరో చిక్కు: సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు

''ఈఎస్ఐ వ్యవహారంలో తన పాత్ర లేదు కాబట్టే అచ్చెన్న దైర్యంగా మీడియా ముందుకు వచ్చి సవాల్ విసిరారు. 43 వేల కోట్లు కొట్టేసింది జగన్ గారే కాబట్టి మీడియా ముందుకు రావడానికి భయపడి చాటుగా ఉంటున్నారు. మౌనమే 43 వేల కోట్ల స్కామ్ కి అంగీకారం సాయి రెడ్డి గారు'' అని వెంకన్న ఆరోపించారు.

''జైలు జీవితం గురించి మీ స్వానుభవంతో చాలా చక్కగా వివరించారు ఎంపీ విజయసాయి రెడ్డి గారు. కాకపోతే ఆ గట్టున ఉన్నది రస్ అల్ ఖైమా సెంట్రల్ ప్రిసన్. ఈ గట్టున ఉన్నది చంచల్ గూడ సెంట్రల్ జైలు. నడి మధ్యన ఉన్నది పావురాల గుట్ట'' అంటూ విరుచుకుపడ్డారు.  

read more  ఉన్మాదులతో యుద్ధం చేస్తున్నా: మీడియాపై దుమ్మెత్తిపోసిన జగన్

''పాపం వచ్చేది ఎండాకాలం. ప్యాలెస్ లో సెంట్రల్ ఏసీ కి అలవాటు పడిన జీవితాలు ఎడారి జైల్లో పరిస్థితి తలుచుకుంటే బాధేస్తుంది. జైలు పిలుస్తుంది ఊచలు లెక్క పెట్టాలి వెైఎస్ జగన్. చిప్పకూడు తినాలి జగన్'' అని జగన్, విజయసాయి రెడ్డిలను బుద్దా వెంకన్న ఎద్దేవా చేశారు. 

PREV
click me!

Recommended Stories

సంక్రాంతికి వారం రోజులు సెల‌వులు.. ఎప్పటి నుంచి ఎప్ప‌టివ‌ర‌కు అంటే..?
హెచ్‌ఐవీ రోగుల సంఖ్యలో రెండో స్థానంలో ఆంధ్రప్రదేశ్‌