ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం మరికొన్ని జిల్లాలో ఉర్దూ మీడియం పాఠశాలలను ప్రారంభించే ఆలోచనలో వుందని మంత్రి అవంతి శ్రీనివాస్ ప్రకటించారు. ఇలా అధికార భాష తెలుగు, రెండో అధికార భాష ఉర్దూకు వైసిపి ప్రభుత్వం న్యాయం చేస్తోందన్నారు.
అమరావతి: టిడిపి హయాంలో అధికార భాష సంఘంను నిర్వీర్యం చేశారని పర్యాటక, సాంస్కృతిక శాఖామంత్రి ముత్తంశెట్టి శ్రీనివాస్ ఆరోపించారు. గత ఐదేళ్లు అధికార భాష తెలుగు, రెండో అధికార భాష ఉర్ధూను నిర్లక్ష్యం చేశారని అన్నారు. అలాంటివారు ఇప్పుడు తెలుగు భాషపై ప్రేమను ఒలకబోయడం విడ్డూరంగా వుందని అన్నారు.
వైసిపి అధికారాన్ని చేపట్టి జగన్మోహన్ రెడ్డి సీఎం అయిన తరువాతే రాష్ట్రంలో అధికార భాషాసంఘం ఏర్పాటయ్యిందని గుర్తుచేశారు. అంతేకాకుండా ప్రముఖ సాహితీవేత్త యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ ను చైర్మన్‌గా, పలువురు భాషావేత్తలను సభ్యులుగా నియమించడం జరిగిందన్నారు.
undefined
రాష్ట్రంలో ఇప్పటికే అయిదు జిల్లాల్లో ఉర్దూను రెండో అధికార భాషగా అమలు చేస్తున్నామని తెలిపారు. ఎక్కువగా ముస్లీంలు వున్న రాయలసీమ జిల్లాల్లో ఉర్ధూ రెండో అధికార భాషగా వుందన్నారు. వీటితోపాటు కృష్ణా, ప్రకాశం జిల్లాల్లో కూడా ప్రభుత్వ పాఠశాలల్లో ఉర్ధూ మీడియం అమలును పరిశీలిస్తామని మంత్రి ప్రకటించారు.
read more అన్నా క్యాంటిన్ల పునఃప్రారంభం ... కొత్త పద్దతిలో: బొత్స
రాష్ట్రంలో కొత్తగా ప్రవేశపెట్టాలని భావిస్తున్న ఇంగ్లీష్ మీడియంపై ప్రతిపక్షలు చేస్తున్న విమర్శలను ఇదే అసెంబ్లీ సమావేశాల్లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తనదైన శైలిలో కౌంటరిచ్చారు. ఇంగ్లీష్ మీడియం అనగానే ఒక సామాజిక వర్గం ప్రభుత్వంపై దాడి మొదలుపెట్టిందని ఆయన మండిపడ్డారు. ఇదే సమయంలో ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు పేరును సైతం సీఎం ప్రస్తావించారు.
మీ పిల్లలు ఇంగ్లీష్ మీడియంలో చదవడం లేదా అంటూ ప్రశ్నించిన ఆయన పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియంపై తెలుగుదేశం పార్టీ అనేక యూ టర్న్‌లు తీసుకుందని ధ్వజమెత్తారు. 2014 నుంచి 2019 వరకు టీడపీ ఒక పద్ధతి ప్రకారం ప్రభుత్వ పాఠశాలలను నిర్వీర్యం చేసిందని సీఎం ఫైరయ్యారు.
హేతుబద్ధీకరణ పేరుతో దాదాపు 6 వేల స్కూళ్లు మూసివేశారని.. పిల్లలంతా నారాయణ, చైతన్య స్కూళ్లకు వెళ్లడమే అప్పటి ప్రభుత్వ ఉద్దేశ్యమని, అందుకే ఆ చర్యలని జగన్ ఎద్దేవా చేశారు.
read more భారీఎత్తున కోడికత్తుల తయారీ...కాకినాడలో పట్టుబడ్డ వ్యాపారి
తాము చేస్తోంది ఒక విప్లవాత్మక పరిణామం అని, ‘రైట్ టు ఇంగ్లిష్ మీడియమ్’ అన్నది తమ లక్ష్యమని సీఎం స్పష్టం చేశారు. అందుకే గతంలో ఎన్నడూ లేని విధంగా పనులు చేపట్టామన్న ఆయన, ‘నాడు–నేడు’ కార్యక్రమాన్ని ప్రస్తావించారు. మనబడి నాడు–నేడు కార్యక్రమంలో రాష్ట్రంలోని 45 వేళ్ల స్కూళ్లను బాగు చేస్తున్నామని వెల్లడించారు.
గత 5 ఏళ్లలో ప్రభుత్వ పాఠశాలల బాగు కోసం చేసిన వ్యయం ఏటా కనీసం రూ.50 కోట్లు కూడా లేవని, ఈ విషయంలో చంద్రబాబు చిత్తశుద్ధి అలా ఉందని గుర్తు చేశారు. ప్రభుత్వ పాఠశాలల గురించి చంద్రబాబు ఏనాడూ పట్టించుకోలేదని ఆక్షేపించారు.
ప్రభుత్వ పాఠశాలల్లో తెలుగు ఒక సబ్జెక్ట్‌గా తప్పనిసరిగా ఉంటుంది. మన పిల్లలు ఇంగ్లిష్‌లో పట్టు సాధించకపోతే, ప్రపంచ పోటీ ఎదుర్కోలేరు. నిరుపేద పిల్లల జీవితాలు మార్చడం కోసమే గట్టిగా ఈ నిర్ణయం తీసుకున్నామని ఈ వేదికగా చెబుతున్నానని ముఖ్యమంత్రి అసెంబ్లీలో ప్రకటించారు.
చంద్రబాబు కుమారుడు నారా లోకేష్‌ను ఎక్కడ చదివించాడు? మనవణ్ని ఏ మీడియమ్‌లో చదివించాడు? చంద్రబాబు పక్కన అచ్చెన్నాయుడు ఉన్నాడు. ఆయన కొడుకును ఏ మీడియమ్‌లో చదివించారని జగన్ ప్రశ్నించారు.