నూతన రాష్ట్రాల అభివృద్దికి కేంద్ర ప్రభుత్వం కట్టుబడి వుందని... అందులో భాగంగానే ఏపి అభివృద్దిపై ప్రత్యేకంగా దృష్టి సారించినట్లు కేంద్ర మంత్రి సదానందగౌడ వెల్లడించారు.
అమరావతి: సిపెట్ లో ట్రైనింగ్ పొందిన వారికి ఉద్యోగ అవకాశాలు ఎక్కువగా ఉంటాయని సీఎం జగన్ అన్నారు. ఇలాంటి స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ లు 25 పార్లమెంట్ నియజకవర్గాల్లోనూ ఏర్పాటు చేశామని ప్రకటించారు. ప్రతి ఇండస్ట్రీని కవర్ చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా సెంటర్ లు ప్రారంభించబోతున్నట్లు ముఖ్యమంత్రి ప్రకటించారు.
కృష్ణా జిల్లా గన్నవరం మండలం సూరంపల్లిలో సెంట్రల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ప్లాస్టిక్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ ( సిపెట్ ) భవన సముదాయాన్ని కేంద్ర మంత్రి సదానందగైడతో కలిసి ముఖ్యమంత్రి జగన్ ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో జగన్ మాట్లాడారు.
undefined
దేశంలోనే మొదటిసారి 75 శాతం లోకల్ వారికి ఉద్యోగాలు వచ్చేలా చట్టం చేసామన్నారు. చట్టంతో పాటు బాధ్యతగా పారిశ్రామిక వేత్తలకు స్కిల్ ఉన్న వారిని అందించాల్సి భాద్యత తమపై వుంది. అందేకోసమే పరిశ్రమలకు కావాల్సిన విధంగా మన యువతను ట్రైన్ చేస్తున్నామన్నారు. యువతకు పెద్ద ఎత్తున ఉపాధి కల్పించడమే మా ప్రభుత్వ ద్యేయమన్నారు.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న కేంద్ర మంత్రి సదానంద గౌడ మాట్లాడుతూ... ప్లాస్టిక్ వినియోగం, కాలుష్యం దేశంలో రోజురోజుకు పెరుగుతున్నాయని అన్నారు. ఈ నేపథ్యంలో ప్లాస్టిక్ రీసైకిల్ చెయ్యడం తప్పనిసరని పేర్కొన్నారు. ప్లాస్టిక్ రీసెర్చ్ పై కేంద్రం దృష్టి పెట్టిందని వెల్లడించారు. వినూత్న ఆలోచనలతో ప్లాస్టిక్ కాలుష్యాన్ని నిరోదించేందుకు రీసెర్చ్ సెంటర్లు ఏర్పాటు చేయబోతున్నామన్నారు.
read more flood alert Video : ప్రజలు అప్రమత్తంగా ఉండాలి...వరద సమీక్ష చేసిన MLA
నూతన రాష్ట్రాల అభివృద్ధి పై కేంద్రం ప్రత్యేక శ్రద్ధ పెడుతోందని పేర్కొన్నారు. విశాలమైన కోస్తా ఆంధ్ర తీర ప్రాంతాల్లో పారిశ్రామిక అభివృద్ధికి కేంద్రం సహకరిస్తుందని హామీ ఇచ్చారు. నెల్లూరు జిల్లా నాయుడు పేటలో మరో సిపెట్ సెంటర్ ని ఏర్పాటు చేయనున్నట్లు కేంద్ర మంత్రి ప్రకటించారు.
సిపెట్ ఆధ్వర్యంలో 2015 నుండి కృష్షా జిల్లాలో శిక్షణాకార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వాల సంయుక్త ఆర్ధిక సహాయంతో రూ . 50 కోట్లతో కొత్త భవనాన్ని నిర్మించారు. రూ . 20 కోట్లతో భవన నిర్మాణంతో పాటు మరో 30 కోట్లతో ఆధునిక సాంకేతికతో కూడిన ధర్మల్ ల్యాబ్ , ఆప్టికల్ ల్యాబ్, ఎలక్ట్రికల్ ల్యాబ్ , మెకానికల్ ల్యాబ్ ఏర్పాటు చేశారు.
read more డ్రగ్స్ డీలర్ గా మారిన మెరైన్ ఇంజనీర్... ముఠా గుట్టురట్టు
డిప్లమోప్లాస్టిక్ టెక్నాలజీ , డిప్లమో ఇప్లాస్టిక్ మోల్ టెక్నాలజీ , పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిప్లమోఇ ప్రాసెసింగ్ అండ్ టెస్టింగ్ వంటి దీర్ఘకాలిక కోర్సులలో యువతకు నైపుణ్యాభివృద్ది శిక్షణ అందిస్తున్నారు. ప్లాస్టిక్ మరియు అనుబంధ రంగాలు , ప్రాసెసింగ్ , టెస్టింగ్ , టూలింగ్ మరియు డిజైనింగ్ కోర్సులలో శిక్షణ శిక్షణలో భాగంగానే సాంకేతిక సహకారం , సేవలను పరిశ్రమలకు అందించేందుకు సిపెట్ చొరవ తీసుకుంటోంది.