గత 22 రోజులుగా రాజధాని అమరావతికి మద్దతుగా నిరసనల్లో పాల్గొంటున్నారు. సీఎం జగన్ రాజధాని మార్పు ప్రకటన చేసినప్పటి నుంచి ఆయన తీవ్ర మనోవేదనకు గురయ్యారని కుటుంబ సభ్యులు తెలిపారు.
రాజధాని ప్రాంతం కృష్ణాయపాలెం గ్రామానికి చెందిన రైతు అద్దేపల్లి కృపానందం (68) బుధవారం తెల్లవారుజామున గుండె పోటుతో మృతి చెందాడు. ఆయన గత 22 రోజులుగా రాజధాని అమరావతికి మద్దతుగా నిరసనల్లో పాల్గొంటున్నారు.
సీఎం జగన్ రాజధాని మార్పు ప్రకటన చేసినప్పటి నుంచి ఆయన తీవ్ర మనోవేదనకు గురయ్యారని కుటుంబ సభ్యులు తెలిపారు. గతంలో ఆయన తనకున్న 0.50 సెంట్ల భూమిని ల్యాండ్ పూలింగ్ కోసం ఇచ్చాడు. ఈ నేపథ్యంలో బుధవారం తెల్లవారుజామున గుండెపోటు వచ్చింది.
undefined
AlsoRead రాజధానిగా అమరావతిని కొనసాగించాలన్నదే నా అభిప్రాయం... కానీ..: వైసిపి ఎమ్మెల్యే...
వెంటనే కుటుంబ సభ్యులు కృపానందంను మంగళగిరి లోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు చెప్పడంతో గుంటూరుకు తరలిస్తుండగా మార్గమధ్యలో మృతిచెందినట్లు బంధువులు తెలిపారు. రాజధాని రైతు మరణించాడనే వార్త తెలియడంతో గ్రామ ప్రజలు ఆయన నివాసం వద్దకు చేరుకుంటున్నారు.