ఆటో యజమానులకు వరం.. జగన్ చిత్రపటానికి పాలాభిషేకం...

Published : Oct 08, 2019, 08:07 AM IST
ఆటో యజమానులకు వరం.. జగన్ చిత్రపటానికి పాలాభిషేకం...

సారాంశం

మైలవరం శాసనసభ్యులు వసంత కృష్ణ ప్రసాదు  మాట్లాడుతూ పాదయాత్ర సందర్భంగా ఇచ్చిన ప్రతి హమీని నెరవేర్చటమే లక్ష్యం గా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చిత్తశుద్ధితో పనిచేస్తున్నట్లు తెలిపారు.   

మాట తప్పని మడమ తిప్పని మహానేత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అంటూ ఆటో యజమానులు పొగడ్తల వర్షం కురిపించారు. ఇచ్చిన మాట కోసం కట్టుబడి అటో యజమానులకు రూ 10 వేల రూపాయలు ఆర్థిక సహాయం మంజూరు చేశారని వారు పేర్కొన్నారు.

సోమవారం రాత్రి ఇబ్రహీంపట్నం మండలం గుంటుపల్లి గ్రామంలో అటో యజమానులతో కలిసి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి చిత్రపటానికి  పాలాభిషేకం చేశారు.ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మైలవరం శాసనసభ్యులు వసంత కృష్ణ ప్రసాదు  మాట్లాడుతూ పాదయాత్ర సందర్భంగా ఇచ్చిన ప్రతి హమీని నెరవేర్చటమే లక్ష్యం గా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చిత్తశుద్ధితో పనిచేస్తున్నట్లు తెలిపారు. 

నవరత్నాలను పేదలందరికి అందించే లక్ష్యం తో ఏర్పాటైన జగన్మోహనరెడ్డి గారి ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తున్నట్లు తెలిపారు.ఈ సందర్భంగా అటో యజమానులు తమ అభిమానాన్ని చాటుకున్నారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గుంటుపల్లి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు నాయకులు ఇబ్రహీంపట్నం మండలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు నాయకులు పాల్గొన్నారు

PREV
click me!

Recommended Stories

సంక్రాంతికి వారం రోజులు సెల‌వులు.. ఎప్పటి నుంచి ఎప్ప‌టివ‌ర‌కు అంటే..?
హెచ్‌ఐవీ రోగుల సంఖ్యలో రెండో స్థానంలో ఆంధ్రప్రదేశ్‌