
హైదరాబాద్‌లో నిర్వహించిన ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో మ్యూజిక్ డైరెక్టర్ తమన్ మాట్లాడారు. అఖండ తాండవంలో శివుడే తనతో మ్యూజిక్ చేయించుకున్నారన్నారు. మైనస్ 14 డిగ్రీల వాతావరణంలో బాలయ్య పడ్డ కష్టం మాటల్లో చెప్పలేమన్నారు. థియేటర్లలో ఆయన విశ్వరూపం చూస్తే ఫ్యాన్స్‌కి పూనకాలు రావడం ఖాయమని చెప్పారు.