
ఇష్యూతో సంబంధం లేనివాళ్లు రియాక్టయ్యారన్న శివాజీ వ్యాఖ్యలకు అనసూయ కౌంటరిచ్చారు. 'అతివినయం ధూర్త లక్షణం. ఆయనకు సింపథీ కావాలి. నేను ఒకటి, రెండు సినిమాల్లో హీరోయిన్గా నటించాను. మా ఇష్టానికి మమ్మల్ని జీవించనివ్వండి. హీరోయిన్స్ ఇబ్బంది పడుతున్నారని మీరు భావిస్తే జంతువుల్లా ప్రవర్తించవద్దని యువకులకు చెప్పండి. మొన్న ఈవెంట్లో మాట్లాడిందే మీ అసలు స్వరూపం' అని కౌంటర్ ఇచ్చారు.