ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ప్రతిపక్ష హోదాపై ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర బడ్జెట్ సమావేశాలు ప్రారంభం సందర్భంగా గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రసంగిస్తుండగా.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు, ఆ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీ నుంచి వాకౌట్ చేయడాన్ని తప్పుపట్టారు. 11 సీట్లతో ఐదేళ్లు పోరాటం చేసినా వైసీపీకి ప్రతిపక్ష హోదా రాదంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. అసెంబ్లీలో రెండో అతిపెద్ద పార్టీ జనసేన అని... గతంలో అధికారంలో ఉన్నంత మాత్రాన పార్టీలకు ప్రతిపక్ష హోదా ఇవ్వరని వ్యాఖ్యానించారు.