ఆపరేషన్ సిందూర్ లో అమరుడైన అగ్నివీర్ జవాన్ మురళీ నాయక్ కు కుటుంబాన్ని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పరామర్శించారు. శ్రీ సత్యసాయి జిల్లా కళ్ళి తండాకు చేరుకొని మురళీ నాయక్ ను కడసారి చూసి నివాళి అర్పించారు. ఆయన కుటుంబానికి రూ. 25 లక్షలు ఆర్థిక సహాయం అందించారు. మురళీ నాయక్ తల్లిదండ్రుల వేదన చూసి పవన్ కళ్యాణ్ కన్నీళ్లు పెట్టుకున్నారు.