జమ్మూ కాశ్మీర్లోని పహల్గాంలో ఉగ్ర దాడి ప్రపంచ వ్యాప్తంగా కలకలం రేపింది. ఈ ఘటనలో పర్యాటకులు, స్థానికులు తీవ్రంగా గాయపడ్డారు. పలువురు ప్రాణాలు కోల్పోయారు. ఈ నేపథ్యంలో జమ్మూ కాశ్మీర్ వ్యాప్తంగా భద్రతా బలగాలు భారీగా మోహరించాయి. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సౌదీ అరేబియా పర్యటనను అర్ధాంతరంగా ముగించుకుని భారత్ కి తిరిగి వచ్చారు. ఇప్పటికే బైసరన్ లోయను ఇండియన్ ఆర్మీ, భద్రతా బలగాలు జల్లెడ పడుతున్నాయి. కాగా, పహల్గాం ఘటనపై మోదీ విమానాశ్రయంలోనే అత్యవసర భేటీ నిర్వహించారు. ఉగ్ర దాడిపై పూర్తి వివరాలు తెలుసుకున్నారు.