
ప్రధాని నరేంద్ర మోదీ ఆదంపూర్ ఎయిర్ బేస్‌ను సందర్శించారు. అధికారులు, జవాన్లతో ముచ్చటించిన అనంతరం అక్కడ ప్రసంగించారు. ఆపరేషన్ సిందూర్‌లో పాల్గొన్న భారత త్రివిధ దళాలపై ప్రధాని మోదీ ప్రశంసలు కురిపించారు. భారత సాయుధ దళాల సమన్వయం అసాధారణమని ప్రశంసించారు. ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ మాత్రమే కాదు, బీఎస్ఎఫ్ లాంటి ఇతర బలగాలు కూడా అద్భుతంగా పని చేశాయన్నారు. సముద్రంలో నేవీ ఆధిపత్యం, భూభాగంలో ఆర్మీ బలమైన రక్షణ, అలాగే వైమానిక దళం దేశ బలాన్ని ప్రపంచానికి చాటాయని మోదీ స్పష్టం చేశారు. ఇది భారత రక్షణ వ్యవస్థ సాంకేతికతకు, ఐక్యతకు నిదర్శనమని కొనియాడారు.