
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలకు మంత్రి పార్థసారథి కౌంటర్ ఇచ్చారు. అమరావతి దేవతల రాజధాని అని స్వయంగా ప్రధాని నరేంద్ర మోదీయే ప్రశంసించారన్నారు. కానీ, వైసీపీకి అమరావతి పేరు వినగానే కడుపు మంట వస్తోందన్నారు. గత ప్రభుత్వాలు అమరావతిపై విషం చిమ్మాయని మంత్రి పార్థసారథి మండిపడ్డారు. ప్రజల ఆశయాలను గౌరవించి రాజధాని నిర్మాణానికి వైసీపీ నాయకులు ఇప్పటికైనా సహకరించాలని పిలుపునిచ్చారు.