Galam Venkata Rao | Published: Apr 10, 2025, 2:00 PM IST
ఆంధ్రప్రదేశ్‌లో విద్యుత్ ఒప్పందాలపై మరోసారి రాజకీయ దుమారం రేగింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయకత్వంలోని టీడీపీ ప్రభుత్వం ఇప్పుడు యాక్సిస్ ఎనర్జీతో ఒప్పందం కుదుర్చుకుంటోంది. ఇదే ఒప్పందాన్ని గతంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ హయాంలో SECIతో చౌక ధరకు కుదుర్చారు. ఇప్పుడు దాదాపు రెండింతల ధరకు ఇదే ఒప్పందాన్ని చేపట్టడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.