Dec 27, 2020, 11:21 PM IST
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసిఆర్ దత్త పుత్రిక ప్రత్యూష వివాహం రేపు చరణ్ రెడ్డితో జరగనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆదివారం రాష్ట్ర మహిళాభివృద్ది, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఐఏఎస్ ఆఫీసర్స్ అసోసియేషన్‌లో ప్రత్యూషను పెళ్లికూతురును చేశారు. ఈ కార్యక్రమంలో ప్రత్యూషకు పట్టుబట్టలు, డైమండ్ నెక్లెస్ పెట్టి, ఆశీర్వదించారు కేసిఆర్ సతీమణి శోభ. ఈ వేడుకకు మంత్రి సత్యవతి రాథోడ్, మహిళా భివృద్ధి కమీషనర్, ప్రత్యేక కార్యదర్శి దివ్య, ఇతర అధికారులు, సిబ్బంది హాజరయ్యారు.