అంబర్ పేట ఘటన మరువకముందే ... హాస్టల్లోకి చొరబడి విద్యార్థిపై దాడిచేసిన వీధికుక్కలు

అంబర్ పేట ఘటన మరువకముందే ... హాస్టల్లోకి చొరబడి విద్యార్థిపై దాడిచేసిన వీధికుక్కలు

Published : Feb 22, 2023, 10:44 AM IST

కరీంనగర్ : హైదరాబాద్ లోనే కాదు తెలంగాణ వ్యాప్తంగా వీధికుక్కల స్వైరవిహారం చేస్తున్నారు.

కరీంనగర్ : హైదరాబాద్ లోనే కాదు తెలంగాణ వ్యాప్తంగా వీధికుక్కల స్వైరవిహారం చేస్తున్నారు. అంబర్ పేటలో అభం శుభం తెలియని ఐదేళ్ల బాలుడు వీధికుక్కల దాడిలో ప్రాణాలు కోల్పోయిన అమానుష ఘటన మరువకముందే ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో అలాంటి దారుణాలే చోటుచేసుకున్నాయి. శంకరపట్నం ఎస్సీ హాస్టల్లో చదువుకుంటున్న సుమన్ అనే విద్యార్థి కూడా కుక్కల బారిన పడ్డాడు. హాస్టల్లోకి చొరబడి మరీ వీధికుక్కలు బాలుడిపై దాడిచేసాయి. దీంతో హాస్టల్ సిబ్బంది తల్లిదండ్రులకు సమాచారమివ్వగా వారు హాస్పిటల్ కు తరలించారు. ఇదే కరీంనగర్ జిల్లా వీణవంక మండలం మల్లారెడ్డి గ్రామానికి చెందిన రాపాక యేసయ్య(55) కుక్కలు వెంటపడటంతో తీవ్రంగా గాయపడ్డాడు. బైక్ పై వెళుతున్న యేసయ్యను వీధికుక్కలు వెంటపడటంతో భయపడిపోయిన అతడు వేగంగా పోనిచ్చాడు. ఈ క్రమంలోనే బైక్ అదుపుతప్పి కిందపడటంతో యేసయ్యకు తీవ్ర గాయాలయ్యాయి. దీంతో అతడిని కుటుంబసభ్యులు హుజురాబాద్ హాస్పిటల్ కు తరలించారు. 

02:57పిడుగులు, ఈదురుగాలుల జాగ్రత్త.. ఏపీ, తెలంగాణకు వాతావరణ శాఖ అలర్ట్ | Asianet News Telugu
03:28బిగ్ అలర్ట్.. ఏపీ, తెలంగాణపై మళ్లీ వాయుగుండం | Big Weather Alert for AP & Telangana!
04:39తెలంగాణ, ఏపీలో దంచికొట్టనున్న వర్షాలు...గ్రౌండ్ లెవల్లో అధికారుల అలర్ట్ | Heavy Rains Alert
21:58తెలంగాణ ప్రజాపాలన దినోత్సవంలో CM రేవంత్ రెడ్డి పవర్ ఫుల్ స్పీచ్ | CM Revanth Reddy Full Speech
18:22Talasani As Revanth Reddy | Telangana Mock Assembly | KTR | KCR | Asianet News Telugu
42:12నాన్ స్టాప్ 40 నిముషాలు నవ్వులు | Telangana Mock Assembly | KTR | Revanth Reddy | Asianet Telugu
08:55తెలంగాణ అసెంబ్లీలో చంద్రబాబు ప్రస్తావన | CM Revanth Reddy | Chandrababu | Asianet Telugu
09:01కేటీఆర్..ఇది పద్దతి కాదు..Speaker Gaddam Prasad To MLA KTR | Telangana Assembly Session
02:24KTR VS POLICE | KTR Fumes Over KCR Security | Asianet News Telugu
15:25కేసీఆర్ ఇంటివద్ద హై టెన్షన్ చుట్టుముట్టిన కాంగ్రెస్ నేతలు | High Tension at KCR Erravelli Residence