అల్వాల్ లో రేవంత్ పట్టణ గోస ప్రారంభం

Feb 24, 2020, 3:24 PM IST

పట్టణ అభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న పట్టణ ప్రగతి కార్యక్రమానికి పోటీగా కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి పట్టణ గోస కార్యక్రమాన్ని తన నియోజకవర్గ పరిధిలోని అల్వాల్ నుంచి సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..  లక్షలలో లబ్ధిదారులు ఉంటే కేవలం వందలలోనే ఇల్లులు ఇచ్చారని మండిపడ్డారు. అసలు వాటి లెక్కలు తేల్చాలని డిమాండ్ చేసారు . పట్టణ సమస్యలపై ప్రబుత్వానికి చిత్తశుద్ధి లేదని మహిళలు ఎదుర్కొంటున్న మరుగుదొడ్ల సమస్య తానే తీర్చుతానని రేవంత్ హామీ ఇచ్చారు . గ్రేటర్ ఎన్నికలు దృష్టిలో పెట్టుకొని ఈ కార్యక్రమాన్ని నిర్వహించాడు. పార్టీ తీసుకున్న కార్యక్రమం కాకపొవడంతో విమర్శలు రాకుండా తన అనుచరులతో మాత్రమే పాల్కొన్నాడు