Jun 4, 2020, 3:31 PM IST
టీపీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ని మరికొంతమంది నేతలను పోలీసులు పటాన్ చెరు టోల్ గేట్ వద్ద అరెస్ట్ చేశారు. జలదీక్షలో భాగంగా మంజీరా డ్యామ్ పరిశీలన కోసం వెడుతున్న నేతలను ఉత్తమ్ కుమార్ నివాసం వద్దే అడ్డుకునే ప్రయత్నం చేశారు. చివరకు పటాన్ చెరు దగ్గర అరెస్ట్ చేశారు. ఉత్తమ్ కుమార్ తో పాటు కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి కూడా ఉన్నాడు. బంజారాహిల్స్‌లోని పిసిసి చీప్ ఉత్తమ్ కుమార్ రెడ్డి నివాసం వద్దకూడా పోలీసులు భారీగా మోహరించారు.