మునుగోడులో చావుడప్పుతో టీఆర్ఎస్ శవయాత్ర ... బిజెపి దిష్టిబొమ్మ దహనం

మునుగోడులో చావుడప్పుతో టీఆర్ఎస్ శవయాత్ర ... బిజెపి దిష్టిబొమ్మ దహనం

Published : Oct 27, 2022, 01:15 PM IST

నల్గొండ : టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి తెలంగాణ ప్రభుత్వాన్ని అస్థిరపర్చే కుట్రలకు ప్రధాని నరేంద్ర మోదీ, హోంమంత్రి అమిత్ షా తెరలేపారని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు.

నల్గొండ : టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి తెలంగాణ ప్రభుత్వాన్ని అస్థిరపర్చే కుట్రలకు ప్రధాని నరేంద్ర మోదీ, హోంమంత్రి అమిత్ షా తెరలేపారని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. కానీ వీరి కుట్రలను భగ్నం చేసి తెలంగాణ ప్రజలకు వారి నిజస్వరూపాన్ని తెలియజేసామని అన్నారు. నరేంద్ర మోడీని ఎదిరించే దమ్మున్న మొనగాడు కేసిఆర్ ఒక్కరేనని... అందుకే ఆయనను బిజెపి టార్గెట్ చేసిందన్నారు. టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు నిఖార్సయిన తెలంగాణ బిడ్డలు... కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిలా వారు అమ్ముడుపోరని అన్నారు. బిడ్డా... కేసీఆర్ అడ్డాలో మీ ఆటలు  సాగవు అంటూ మంత్రి ప్రశాంత్ రెడ్డి బిజెపి నేతలను హెచ్చరించారు. హైదరాబాద్ శివారులోని ఫాంహౌస్ కు పిలిచి టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను ప్రలోభాలకు గురిచేయడానికి బిజెపి ప్రయత్నించిందని మంత్రి ఆరోపించారు. ఇందుకు నిరసనగా మునుగోడులోని చౌటుప్పల్ మండలం నాగారం గ్రామంలో కేంద్ర ప్రభుత్వం, బిజెపి దిష్టిబొమ్మను మంత్రి దహనం చేసారు. టీఆర్ఎస్ శ్రేణులు చావుడప్పుతో బిజెపి దిష్టిబొమ్మ శవయాత్ర నిర్వహించారు. అనంతరం మంత్రి ప్రశాంత్ రెడ్డి ఆ దిష్టిబొమ్మకు నిప్పంటించి దహనం చేసారు. 
 

28:58ఏప్రిల్ 25న కవిత కొత్త పార్టీ ఇక యుద్ధం మొదలు | Kavitha New Political Party | Asianet News Telugu
03:17ఒక్క క్లిక్.. జీవితం మటాష్! | Hyderabad CP VC Sajjanar Warning | IPL betting | Asianet News Telugu
27:05రాములోరి కళ్యాణం వీక్షించిన సీఎం రేవంత్ రెడ్డి దంపతులు | Asianet News Telugu
10:23సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో వైభవంగా సీతారాముల కళ్యాణం | Sitaramula Kalyanam Bhadrachalam
37:22భద్రాచలం సీతారామ కళ్యాణంలో పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి దంపతులు | Bhadrachalam Sri Ramanavami
17:45ఘనంగా భద్రాద్రిలో సీతారాముని కళ్యాణం: Sita Rama Kalyanam Celebrations at Bhadrachalam
10:53హైదరాబాద్ లోని రామకోటిలో ఘనంగా శ్రీరామనవమి: Sri Rama Navami Hyderabad| Asianet News Telugu
03:20Harish Rao Aarogyasri Speech:ఆరోగ్యశ్రీ బిల్లులపై పై హరీష్ రావు కీలక కామెంట్స్ | Asianet News Telugu
17:40అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి ఉగ్రరూపం: Revanth Reddy Powerful Speech in Assembly: | Asianet Telugu
52:11Hyderabad Petrol:పెట్రోల్ బ్యాంకుల్లో నోస్టాక్ బోర్డులు క్యూ క‌డుతోన్న ప్ర‌జ‌లు| Asianet News Telugu
Read more