May 19, 2020, 5:56 PM IST
రాజన్న సిరిసిల్ల జిల్లా లో చేపట్టిన అభివృద్ధి పనులను మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. ముస్తాబాద్ మండల పరిధిలో తెర్లుమద్ది , హనుమాన్ నగర్ గ్రామాలలో కోటి పదిహేను లక్షల వ్యయంతో నిర్మించిన వంతెనలను ప్రారంభించారు. అనంతరం ముస్తాబాద్ మండల కేంద్రంలో 30లక్షలతో నిర్మించిన సెస్ భవనానికి ప్రారంభోత్సవం చేశారు. 19 కోట్లతో నిర్మించిన కొండపూర్ వంతెనను ప్రారంభించారు. ఈ కార్యక్రమం తరువాత సిరిసిల్ల క్యాంపు కార్యాలయంలో జిల్లా అధికారులతో కేటీఆర్ సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు.