Jun 8, 2023, 5:34 PM IST
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దశాబ్ది వేడుకలు రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా నిర్వహిస్తోంది కేసీఆర్ సర్కార్. ఇందులో భాగంగానే ఇవాళ గ్రామగ్రామాన చెరువుల పండగ నిర్వహిస్తున్నారు. పాలకుర్తి నియోజకవర్గ పరిధిలోని వివిధ గ్రామాల్లో జరిగిన ఈ చెరువుల పండగ కార్యక్రమంలో మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు పాల్గొన్నారు. ప్రజలతో కలిసి గంగమ్మ, కట్టమైసమ్మ తల్లులకు పూజలు చేసారు మంత్రి. ఇలా పెద్దవంగర మండలం గంట్లకుంట గ్రామ సమీపంలో చెరువులో దిగిన మంత్రి ఎర్రబెల్లి మత్స్యకారులతో కలిసి చేపలు పట్టారు.ప్యాంటును పైకి లాగి చేరువు నీటిలో దిగిన మంత్రి వల చేతబట్టి చేపల వేటకు సిద్దమయ్యారు. ఇలా కొద్దిసేపు జాలరిగా మారి మంత్రి ఎర్రబెల్లి సరదాగా చేపలు పట్టారు.