Oct 24, 2020, 1:26 PM IST
అల్పపీడనం దారిమళ్లింది.. ప్రమాదం తప్పింది అనుకునే లోపే హైదరాబాద్ కు మరో ముప్పు పొంచి ఉంది. ఇప్పటికీ అనేక కాలనీల్లో నీరు ఇంకా పోలేదు. వీటివల్ల అంటువ్యాధులు ప్రబలే ప్రమాదం ఉంది. ముఖ్యంగా టైఫాయిడ్, మలేరియా, డెంగీ, డయేరియా లాంటివి కాచుకుని ఉన్నాయి. దీనికి తోడూ కరోనా.. ప్రజలు అప్రమత్తంగా లేకపోతే వరదల కంటే ఎక్కువ బీభత్సం చూడాల్సి వస్తోందంటున్నారు వైద్యులు.