తెలంగాణ పోరాటయోధుడు పండగ సాయన్న జయంతి... ఈటల రాజేందర్ ఘన నివాళి

Aug 8, 2022, 3:18 PM IST

మహబూబ్ నగర్ : తెలంగాణ ప్రజల కోసం ఆనాడే నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా వీరోచిత పోరాటం చేసిన పండగ సాయన్న 132వ జయంతి ఉత్సవాల్లో బిజెపి ఎమ్మెల్యే ఈటల రాజేందర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా సాయన్న చిత్రపటానికి పూలమాలవేసి నివాళి అర్పించారు ఈటల. ఇలాంటి మహనీయుల స్పూర్తిని భవిష్యత్ తరాలకు అందించేందుకు గ్రామగ్రామాన వీరి విగ్రహాలు పెట్టాల్సిన అవసరం వుందన్నారు.   ఈ సందర్భంగా ఈటల మాట్లాడుతూ... తెలంగాణలో నిజాం పాలకుల దోపిడీకి, అణచివేతకు వ్యతిరేకంగా సాయన్న పోరాటం చేసారన్నారు. భూస్వామ్య గుండాల నుండి ఆడపడుచుల మానప్రాణాలు కాపాడిన మహనీయుడు సాయన్న అన్నారు. పెద్దలకు వ్యతిరేకంగా పోరాడి పేదవాడి కడుపునింపిన ముదిరాజ్ ముద్దుబిడ్డ పండగ సాయన్న జయంతి ఉత్సవాల్లో పాల్గొనడం ఆనందంగా వుందని ఈటల రాజేందర్ పేర్కొన్నారు.