కరీంనగర్: శాతవాహన వర్సిటీలో ఎలుగుబంటి సంచారం, భయాందోళనలో విద్యార్ధులు (వీడియో)

కరీంనగర్: శాతవాహన వర్సిటీలో ఎలుగుబంటి సంచారం, భయాందోళనలో విద్యార్ధులు (వీడియో)

Siva Kodati |  
Published : Mar 12, 2022, 05:18 PM IST

కరీంనగర్‌ జిల్లాలోని శాతవాహన యూనివర్సిటీలో ఎలుగుబంటి సంచారం కలకలం సృష్టించింది. రంగంలోకి  దిగిన అటవీ శాఖ అధికారులు దానిని బంధించేందుకు గాలింపు చర్యలు చేపట్టారు. 

కరీంనగర్ జిల్లాలోని శాతవాహన యూనివర్శిటీలో ఎలుగు బంటి సంచారం కలకలం సృష్టించింది. వర్సిటీలో గర్ల్స్ హాస్టల్ గేటు ముందు వెళ్తోన్న ఎలుగు బంటిని కొందరు విద్యార్థినిలు గుర్తించారు.. వెంటనే తమ సెల్ ఫోన్‌లో వీడియో చిత్రీకరించారు. దానిని వెంటనే యూనివర్శిటీ అధికారులకు ,అటవీశాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. 

దీంతో హుటాహుటీన వర్శిటీకి చేరుకున్న అటవీశాఖ అధికారులు ఎలుగుబంటి జాడ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. వర్శిటిలో ఉన్న చిట్టడవిలో రెండు బావులున్నాయి. ఈ బావుల వద్దకు తరచూ ఎలుగు బంట్లు నీటి కోసం వస్తుంటాయి. దీంతో ఎలుగు బంటి ఎక్కడో వుందో గుర్తించేందుకు అధికారులు శ్రమిస్తున్నారు. ఎలుగును పట్టుకుంటామని విద్యార్దులు ఎటువంటి భయాందోళనలకు గురి కావద్దని అధికారులు భరోసా ఇచ్చారు. అయితే వర్సిటీ క్యాంపస్‌లో ఎలుగు సంచరిస్తున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది, 
 

03:28Advocate Allam Nagaraju : ఈ వీడియో చూడకపోతే ప్రమాదంలో పడొచ్చు| Asianet News Telugu
05:01పోక్సో చట్టం యొక్క భయంకరమైన నిజాలు POCSO case explained Telugu | Asianet News Telugu
03:02నిఘా నీడలో తెలంగాణ ఆర్టీసీ ఆకతాయిలు, పోకిరీలకు చెక్ | CCTV in TSRTC buses | Asianet News Telugu
04:52CM Revanth Reddy Praises Nirmal Women’s Groups for 100% Loan Repayment | Asianet News Telugu
04:02Kavitha Protest Viral: ధర్నా చేస్తున్న కవితను రోడ్డుపై ఈడ్చుకెళ్ళిన పోలీస్ లు| Asianet News Telugu
10:57KTR Comments: కాంగ్రెస్ కంటే కాక్రోజ్ బెటర్ రేవంత్ రెడ్డి పై కేటీఆర్ సెటైర్లు | Asianet News Telugu
06:17తెలుగు రాష్ట్రాల్లో రికార్డులు బ్రేక్ చేస్తున్న ఎండలు AP Telangana Weather News| Asianet News Telugu
02:47100 కోట్లకు పైగా ఆస్తులు.. ఏసీబీ వలలో భారీ అవినీతి తిమింగళం| ACB Raids on Hyderabad | Asianet Telugu
03:21Big Twist In Johny Master Case : జానీ మాస్టర్ కేసుపై లాయర్ అల్లం నాగరాజు ఊహించని ట్విస్ట్ ??
10:50పోక్సో చట్టం యొక్క భయంకరమైన నిజాలు | Advocate Allam Nagarju On POCSO | Asianet News Telugu