ట్రాఫిక్ కి చెక్ పెట్టండిలా...(వీడియో)

ట్రాఫిక్ కి చెక్ పెట్టండిలా...(వీడియో)

Siva Kodati |  
Published : Oct 15, 2019, 09:22 PM IST

మీరు ఉద్యోగం చేస్తారా? చాలా దూరం ప్రయాణించి రోజూ ఆఫీసుకు వెడతారా? అయితే మీకు ట్రాఫిక్ లో ఇరుక్కుపోయిన అనుభవం ఉండే ఉంటుంది? కొన్నిసార్లు గంటలకొద్దీ ట్రాఫిక్ లో ఇరుక్కుని నరకం చూసి కూడా ఉంటారు. రోజువారీ కార్యక్రమంలో ఇది తప్పనిసరి అయినప్పుడు దీన్నే మనకనువుగా మార్చుకుంటే ఎలా ఉంటుంది. ట్రాఫిక్ లో ఇరుక్కున్న సమయాన్ని చక్కగా మేనేజ్ ఎలా చేసుకోవచ్చో చూద్దామా...

మీరు ఉద్యోగం చేస్తారా? చాలా దూరం ప్రయాణించి రోజూ ఆఫీసుకు వెడతారా? అయితే మీకు ట్రాఫిక్ లో ఇరుక్కుపోయిన అనుభవం ఉండే ఉంటుంది? కొన్నిసార్లు గంటలకొద్దీ ట్రాఫిక్ లో ఇరుక్కుని నరకం చూసి కూడా ఉంటారు. రోజువారీ కార్యక్రమంలో ఇది తప్పనిసరి అయినప్పుడు దీన్నే మనకనువుగా మార్చుకుంటే ఎలా ఉంటుంది. ట్రాఫిక్ లో ఇరుక్కున్న సమయాన్ని చక్కగా మేనేజ్ ఎలా చేసుకోవచ్చో చూద్దామా...

1.    మీ ఫోన్ లో రేడియో ఆన్ చేసుకోండి. మీ కిష్టమైన స్టేషన్ ట్యూన్ చేసుకుని పాటలు ఎంజాయ్ చేయండి. రేడియోలో కంటే మీ దగ్గరే మంచి ప్లేలిస్ట్ ఉంటే అదైనా సరే..చక్కగా మంచి పాటలు ఆస్వాదించండి. సీటులో రిలాక్స్ డ్ వెనక్కి ఒరిగి కూర్చుని ట్రాఫిక్ క్లియర్ అయ్యేంత వరకు పాటలు వినేయండి. మీకు పాటలు మరీ నచ్చితే వాటితో పాటు గొంతు కలపండి. అయితే ఇది కారు అయితేనే బాగుంటుంది. పబ్లిక్ ట్రాన్స్ ఫోర్ట్స్ లో వెళ్లేప్పుడు గట్టిగా పాడితే పక్కవారు ఇబ్బందిపడే ప్రమాదం ఉంది.

2.    రోజుమొత్తంలో మీరేం పనులు చేయాలనుకున్నారు, ఎంతవరకు పూర్తి చేశారు ఒక లిస్ట్ రాసుకోండి. రోజు కాకపోతే వారానికి మీరు పెట్టుకున్న టార్గెట్స్ పూర్తయ్యాయా చెక్ చేసుకోండి. ఎప్పటినుండో చేయాలనుకుని మర్చిపోతున్న విషయాల మీద ఫోకస్ పెట్టండి. దీనివల్ల టైమూ కలిసివస్తుంది..దాంతోపాటు ఇకముందు పనులు మరిచిపోకుండా, సులువుగా ఎలా చేసుకోవచ్చో తెలిసిపోతుంది.

3.    రోజువారీ బిజీ జీవితంలో తల్లిదండ్రులతో మాట్లాడే సమయం కూడా ఉండడం లేదు. సో ఈ ట్రాఫిక్ లో ఇరుక్కున్న సమయాన్ని దానికి ఉపయోగించండి. మీ తల్లిదండ్రులకు లేదా ఎప్పుటినుండో చేయాలని మరిచిపోతున్న క్లోజ్ ఫ్రెండ్స్ కి ఫోన్ చేసి మాట్లాడండి. అయితే రోడ్డుమీద దృష్టి పెట్టడం మరిచిపోవద్దు.

4.    ఎప్పటినుండో చదవాలనుకుని వెంటపెట్టుకుని తిరుగుతున్న పుస్తకాన్ని చదివేయండి. 10,15 ని.లు ట్రాఫిక్ జాం అవ్వబోతుందని అర్థమైనప్పుడు పుస్తకం చదవడం కంటే చక్కటి ప్రత్యామ్నాయం మరొకటి లేదు.

02:34ఆస్ట్రేలియాకు బయల్దేరిన ప్రధాని మోదీ | PM Modi emplanes for Melbourne, Australia
33:50ఇండోనేషియా పార్లమెంట్ లో మోదీ పవర్ ఫుల్ స్పీచ్ | Modi Indonesia Tour
06:59ఇండోనేషియాలో అత్యున్నత పురస్కారం అందుకున్న మోదీ | PM Modi Indonesia Visit | Bintang Adipurna Honour
04:31PM Modi Indonesia Visit: సినిమా రేంజ్ లో ఇండోనేషియాలో మోదీకి గ్రాండ్ వెల్ కమ్ | Asianet News Telugu
09:12Wayanad Landslide: వయనాడ్ మహా విపత్తు వరదల్లో పలువురు గల్లంతు | Asianet News Telugu
05:31గుండెని పిండేసే ఘటనవయనాడ్ వరదలు డ్రోన్ విజువల్స్ | Wayanad Landslide | Asianet News Telugu
10:55Wayanad Landslide: కన్నీళ్లు పెట్టించే సిసి టీవీ దృశ్యాలు వయనాడ్ వరదలు | Asianet News Telugu
02:12Modi Indonesia Visit: ఇండోనేషియా అధ్యక్షుడితో మోదీ కీలక సమావేశం | Asianet News Telugu
10:46Wayanad Landslides: వయనాడ్‌లో కళ్ళముందే విరిగిపడ్డ కొండచరియలు EXCLUSIVE | Asianet News Telugu
05:19Nemmeli Project: ₹2,465 కోట్ల ప్రాజెక్టు పనులను పరిశీలించిన సీఎం విజయ్ | Asianet Telugu