
AI డీప్‌ఫేక్, ఫేక్ న్యూస్ పెరుగుతున్న నేపథ్యంలో కేంద్ర మంత్రి ఆశ్విని వైష్ణవ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఫేక్ న్యూస్‌ను సృష్టించి లేదా వ్యాప్తి చేస్తే కఠిన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు. ప్రజలు సోషల్ మీడియాలో వస్తున్న సమాచారం నిజమో కాదో నిర్ధారించుకోవాలని సూచించారు. డీప్‌ఫేక్ టెక్నాలజీ వల్ల దేశ భద్రత, వ్యక్తిగత గోప్యతకు ముప్పు ఉందని తెలిపారు.