తీరందాటిన నివర్... తమిళ రాజధాని చెన్నై అతలాకుతలం

తీరందాటిన నివర్... తమిళ రాజధాని చెన్నై అతలాకుతలం

Published : Nov 26, 2020, 12:08 PM IST

నివర్ తుఫాను... కొద్దిరోజులగా తమిళ, కన్నడ, తెలుగు ప్రజలను ఆందోళనకు గురిచేస్తూ బుధవారం అర్ధరాత్రి తీరం దాటింది. 

నివర్ తుఫాను... కొద్దిరోజులగా తమిళ, కన్నడ, తెలుగు ప్రజలను ఆందోళనకు గురిచేస్తూ బుధవారం అర్ధరాత్రి తీరం దాటింది. తమిళనాడు - పుదుచ్చేరి మధ్య బుధవారం రాత్రి 11:30 నుంచి ఈ రోజు తెల్లవారుజామున 2:30 గంటల మధ్య ఈ తుపాను తీరం దాటింది. ఎంతో అలజడిని సృష్టిస్తూ తీరం వైపు దూసుకొచ్చిన నివర్ చివరి నిమిషంలో కాస్త శాంతించింది. కాస్త బలహీన పడి తీరం దాటినట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. 
ఇలా తీరందాటిన నివర్ తుపాను ప్రభావంతో దక్షిణకోస్తా తీరం వెంబడి గంటకు 40-60 కి.మీ వేగంతో ఈదురుగాలులు వీస్తున్నాయి. ముఖ్యంగా తమిళనాడు రాజధాని చెన్నైలో భారీ నుండి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈదురుగాలులతో కూడిన వర్షాలకు చెట్లతో పాటు విద్యుత్ వైర్లు రోడ్లపై పడుతూ వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగిస్తోంది. 

ఈ తుపాను ప్రభావంతో తమిళనాడులోని కడలూర్‌, విళ్లుపురం, కళ్లకురిచ్చి జిల్లాల్లో, పుదుచ్చేరిలో కూడా అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. అలాగే ఇరు తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటకలో కూడా నివర్ ప్రభావంతో వర్షాలు కురుస్తున్నాయి. ఇవాళ చిత్తూరు , కర్నూలు, ప్రకాశం, వైఎస్ఆర్ కడప జిల్లాలో అక్కడక్కడ భారీ నుంచి అతిభారీ వర్షాలు, మిగిలిన చోట్ల అక్కడక్కడ పిడుగులతో కూడిన మోస్తారు నుంచి తేలిక పాటి వర్షాలు కురిసే అవకాశాలున్నాయన్న హెచ్చరికల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం, విపత్తుల శాఖ అప్రమత్తమై ముందస్తు జాగ్రత్తలు తీసుకుంది.

03:33పెద్ద మనసుతో ఆదుకున్నారు..అందులో తప్పేంటీ? | Government jobs for Karur victims | CM Vijay
09:24అమర వీరులకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఘన నివాళి |Droupadi Murmu Pays Homage at National War Memorial
07:44CM Vijay First Independence Day | సీఎం హోదాలో తొలిసారి జెండా ఎగరేసిన విజయ్| FlagHoisting | TamilNadu
15:41స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో సీఎం విజయ్ స్పీచ్ కి త్రిష ఫిదా | CM Vijay Independence Day Speech
08:35సీఎం విజయ్ ని చూడగానే లేచి సెల్యూట్ చేసిన త్రిష | CM Vijay & Trisha | Viral Video | Independence Day
14:14Independence Day Celebrations లో కనిపించిన Trisha | CM Vijay | TVK | Asianet News Telugu
10:08సీఎం హోదాలో విజయ్ తొలి స్వాతంత్య్ర వేడుకలు | CM Vijay First Independence Day Celebrations
24:5380వ స్వాతంత్ర దినోత్సవం రాష్ట్రపతి ముర్ము సందేశం | Droupadi Murmu Independence Day speech
14:17ఢిల్లీ ఎర్రకోటలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు రిహార్సిల్స్ | Red Fort Independence Day rehearsal
04:15Megha Akhil NRD: భర్తకు వేరే అమ్మాయిలతో ఎఫైర్... అందుకే కండెక్టర్ తో జంప్ | Kerala Influencers