గడపగడపకు కార్యక్రమంలో వైసీపీ ఎమ్మెల్యేని నిలదీసిన సొంత పార్టీ కార్యకర్తలు... ఉద్రిక్తత

గడపగడపకు కార్యక్రమంలో వైసీపీ ఎమ్మెల్యేని నిలదీసిన సొంత పార్టీ కార్యకర్తలు... ఉద్రిక్తత

Published : May 01, 2023, 05:56 PM IST

అనకాపల్లి జిల్లా ఎలమంచిలి నియోజకవర్గం ఎమ్మెల్యే ఉప్పలపాటి వెంకట రమణమూర్తి రాజు (కన్నబాబు) నిన్న ఆదివారం గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్నారు. 

అనకాపల్లి జిల్లా ఎలమంచిలి నియోజకవర్గం ఎమ్మెల్యే ఉప్పలపాటి వెంకట రమణమూర్తి రాజు (కన్నబాబు) నిన్న ఆదివారం గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇందులో భాగంగా నియోజకవర్గ పరిధిలోని పూడిమడకకు వెళ్లగా సొంత వైసిపి శ్రేణుల నుండి నిరసన ఎదురయ్యింది. ప్రజల సమస్యల కంటే ముందు తమ సమస్యలను పరిష్కరించాలంటూ ఎమ్మెల్యే కన్నబాబును స్థానిక వైసిపి నాయకులు నిలదీసారు. సొంత పార్టీ నాయకులే ఇలా తమను అందరిముందు ప్రశ్నించడంతో ఎమ్మెల్యే సహనం కోల్పోయారు. అప్పటికే సహనం కోల్పోయి ఆగ్రహంగా వున్న ఎమ్మెల్యే కన్నబాబును ఓ వ్యక్తి గత ఎన్నికలో ఇచ్చిన హామీలు ఏమయ్యాయని నిలదీసాడు. దీంతో నన్నే నిలదీస్తావా అంటూ కన్నబాబు అతడిపై చేయిచేసుకున్నాడు. ప్రశ్నించిన వ్యక్తి చెంప చెళ్లుమనిపించడంతో స్థానిక వైసిపి నాయకులు ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఆందోళనకు దిగారు. దీంతో పూడిమడకలో ఉద్రిక్తత చోటుచేసుకుంది.