May 22, 2021, 12:47 PM IST
అమరావతి: నర్సీపట్నం ప్రభుత్వ వైద్యుడు డాక్టర్ సుధాకర్ మృతికి తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు సంతాపం ప్రకటించారు. తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో డాక్టర్ సుధాకర్ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. డాక్టర్ సుధాకర్ ది ప్రభుత్వ హత్యేనని, అందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ బాధ్యత వహించాలని ఆయన అన్నారు.