మరింత రుచిగా తిరుపతి లడ్డూ.. అదనంగా కొల్లాం జీడిపప్పు

By telugu teamFirst Published Oct 5, 2019, 12:06 PM IST
Highlights

జీడిపప్పుని స్వామివారి ప్రసాదంలో కలిపితే.. మరింత రుచి పెరుగుతుందని భావిస్తున్నారు. కేరళ జీడీ అభివృద్ధి సంస్థ (KSCDC) ఇప్పటికే శబరిమల, పళని, పొన్నని తదితర ఆలయాలకు జీడిపప్పును సరఫఱా చేస్తోంది. కేరళ జీడి సంస్థ కేవలం ఓనమ్ పండగ సీజన్ లో రూ.5.5 కోట్ల లాభాలను ఆర్జిస్తోంది. కాగా... కేవలం ఆన్ లైన్ లో 45లక్షలకు పైగా లావాదేవీలు జరుపుతోంది. 
 

తిరుపతి వెంకటేశ్వర స్వామి ప్రపంచ వ్యాప్తంగా ఫేమస్. ఆయన దర్శనం కోసం విదేశాల నుంచి కూడా భక్తులు తరలివస్తుంటారు. ఇక తిరుపతి లో స్వామి తర్వాత అంత ఫేమస్ స్వామి వారి లడ్డూ ప్రసాదమే. మిఠాయి దుకాణాల్లో, ఇంట్లో మనం లడ్డూలు చేసుకున్నా... స్వామి వారి లడ్డూకి ఉన్న రుచి మాత్రం రాదు. ఇతర గుళ్లలో కూడా లడ్డుని ప్రసాదంగా అందిస్తారు. కానీ... తిరుపతి లడ్డూ రుచి మాత్రం మిగితా వాటికి రాదు అనడంలో అతిశయోక్తి లేదు. కాగా.. ఇప్పటి నుంచి శ్రీవెంకటేశ్వర స్వామి లడ్డూకి మరింత రుచి అదనంగా లభించనుంది.

ఆ రుచి కేరళ రాష్ట్రం నుంచి అందనుంది. ఏంటి అర్థం కాలేదా..? కేరళ రాష్ట్రంలోని కొల్లాంలో జీడిపప్పుకి ప్రాముఖ్యత ఎక్కువ.ఆ జీడిపప్పు చాలా రుచిగా ఉంటుంది. ఇప్పుడు ఈ జీడిపప్పుని... స్వామివారి లడ్డు ప్రసాదంలో కలపనున్నారు. ఈ మేరకు టీటీడీ కేరళ రాష్ట్రంతో ఒప్పందం కుదుర్చుకుంది. కొల్లాం జీడిపప్పుకి నాణ్యత ఎక్కువ.

అందుకే ఆ జీడిపప్పుని స్వామివారి ప్రసాదంలో కలిపితే.. మరింత రుచి పెరుగుతుందని భావిస్తున్నారు. కేరళ జీడీ అభివృద్ధి సంస్థ (KSCDC) ఇప్పటికే శబరిమల, పళని, పొన్నని తదితర ఆలయాలకు జీడిపప్పును సరఫఱా చేస్తోంది. కేరళ జీడి సంస్థ కేవలం ఓనమ్ పండగ సీజన్ లో రూ.5.5 కోట్ల లాభాలను ఆర్జిస్తోంది. కాగా... కేవలం ఆన్ లైన్ లో 45లక్షలకు పైగా లావాదేవీలు జరుపుతోంది. 

టిటిడి నిత్యం 4 లక్షల పైచిలుకు లడ్డూలను తయారు చేస్తోంది. ఇందుకు నిత్యం 2 వేల 840 కిలోల జీడిపప్పు వినియోగమౌతోంది. స్వామి వారి విషయాలతో పాటు భక్తుల అన్న ప్రసాదాల తయారీలో వాడే సరుకులను టీటీడీ ఈ టెండర్ల ద్వారా ప్రైవేటు సంస్థల నుంచి కొనుగోలు చేస్తోంది.

click me!