టీడీపీ అధినేత చంద్రబాబు ఇలాకా కుప్పంలో వైసీపీ నేత విద్యాసాగర రావుపై హత్యకు కుట్ర జరిగింది. ఓ రౌడీషీటర్ కు సుపారీ ఇచ్చి విద్యాసాగర రావును హత్య చేసేందుకు కుట్ర చేశారు.
చిత్తూరు: చిత్తూరు జిల్లాలో వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ నేత విద్యాసాగర రావు హత్యకు కుట్ర జరిగింది. టీడీపీ అధినేత, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి నియోజకవర్గంలో ఈ సంఘటన చోటు చేసుకుంది. పీలేరుకు చెందిన రౌడీషీటర్ గణేష్ కు రూ. 10 లక్షలు సుపారీ ఇచ్చి విద్యాసాగర రావును హత్య చేసేందుకు కుట్ర చేసినట్లు ఆరోపణలు వచ్చాయి.
ఆ విషయాన్ని ఓ వ్యక్తి విద్యాసాగర్ రావుకు ఫోన్ చేసి చెప్పాడు. దీంతో విద్యాసాగరరావు కుప్పం పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. ఇందుకు సంబంధించి ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు
undefined
విద్యాసాగర రావు హత్యకు సుపారీ ఇచ్చింది ఎవరనే విషయంపై పోలీసులు ఆరా తీస్తున్నారు. విద్యాసాగర రావు ఎన్నికలకు ముందు టీడీపీకి రాజీనామా చేసి వైసీపీలో చేరారు. ఎన్నికలకు రెండు నెలల ముందు వైసీపీ అభ్యర్థి చంద్రమౌళి అనారోగ్యం పాలు కావడంతో ఆయన కుమారుడు భరత్ కు సాయపడుతూ పార్టీ శ్రేణులకు విశ్వాసం కలిగించారు.
తనకు ఇంచార్జీ బాధ్యతలు అప్పగించినన రామకుప్పం మండలంలో విద్యా,సాగర రావు చంద్రబాబు మెజారిటీని 8,300 నుంచి 3,400కు తగ్గించగలిగారు.