మరణంలోనూ `విశ్వాసం: యజమాని మృతితో బెంగటిల్లి శునకం మృతి

By telugu teamFirst Published Sep 28, 2019, 4:11 PM IST
Highlights

యజమాని మృత్యువును తట్టుకోలేక బెంగటిల్లి శునకం తుది శ్వాస విడిచింది. మరణంలోనూ శునకం విశ్వాసాన్ని చూపడం స్థానికులను తీవ్రంగా కలచి వేసింది. ఈ సంఘటన చిత్తూరు జిల్లాలో సంభవించింది.

తిరుపతి: తను ఎంతో జాగ్రత్తగా రక్షించిన యజమాని మృతిచెందాడని ఓ పెంపుడు శునకం తట్టుకోలేకపోయింది. అంత్యక్రియలు పూర్తయిన కొద్దిసేపటికే ఆ జీవి ప్రాణలు  విడిచింది. చిత్తూరు జిల్లాలో ఈ ఘటన చోటు చేసుకుంది. శ్రీకాళహస్తి పట్నం ముత్యాలమ్మ గుడి వీధికి చెందిన సాయి చంద్రమౌళి(52) మైసూరు లో నివాసం ఉండేవారు.

రెండు రోజుల కిందట గుండెపోటుతో మృతి చెందాడు. బంధువర్గ మంత శ్రీకాళహస్తిలో ఉండడంతో మృతదేహాన్ని ఇక్కడికి తీసుకు వచ్చారు. సాయి చంద్రమౌళి ప్రేమగా పెంచుకున్న కుక్క( బ్రూనో) ముఖ దేహంతో పాటు వాహనం ఎక్కడంతో దాన్ని తీసుకువచ్చారు. బుధవారం సాయి చంద్రమౌళి అంత్యక్రియలు సందర్భంగా బ్రూనో స్మశాన వాటికకూ  వెళ్ళింది. తిరిగి ఇంటికి వచ్చిన ఆ శునకం గురువారం ప్రాణాలు విడిచింది. 

ఈ పరిణామం   సభ్యులను కలచివేసింది. బ్రూనో కళేబరాన్ని సైతం అదే స్మశాన వాటికలో ఖననం చేశారు. ఇందులో ఇంకో ట్విస్ట్ కూడా ఉంది. బ్రూనోకూ ఓ ఫ్రెండుంది. బ్రూనో చనిపోయిందని తెలుసుకుని ఆ కుక్క కడదాకా వచ్చింది. 

దహన క్రియలు ముగిసేవరకు ఉండి వారితో పాటు తిరిగి వచ్చింది. ఈ దృశ్యాన్ని గమనించిన యజమాని ఇప్పుడు బ్రూనో ఫ్రెండ్ ను ఇంట్లో ఉంచుకుని పెంచుతున్నారు...

click me!