బోపన్న, సానియా ఆరోపణలు నిరాధారం.. టెన్నిస్ అసోసియేషన్

By telugu news team  |  First Published Jul 20, 2021, 9:31 AM IST

నిబంధనల గురించి తెలిస్తే పూర్తి విషయం తెలుస్తుందన్నారు. దాని కోసం వారు ఐటీఎఫ్ రూల్స్ బుక్ ని పరిశీలించాలని సూచించారు.


త్వరలో టోక్యో ఒలంపిక్స్ జరగనున్న సంగతి తెలిసిందే. ఈ ఒలంపిక్స్ లో ప్రముఖ భారత టెన్నిస్ స్టార్స్ రోహన్ బోపన్న అర్హత లభించలేదు. దీంతో.. వారు ట్విట్టర్ వేదికగా అసహనం వ్యక్తం చేశాడు. అతను చేసిన ట్వీట్ పై  సానియా మీర్జా కూడా స్పందించి.. అతనికి మద్దతుగా నిలిచింది. కాగా.. వారిద్దరూ చేసిన ట్వీట్స్ పై ఆల్ ఇండియా టెన్నిస్  అసోసియేషన్ ఖండించింది.

రోహన్ బోపన్న, సానియా మీర్జా చేసిన వ్యాఖ్యలు అనుచితమైనవని.. తప్పుదోవ పట్టేంచేలా  ఉన్నాయన్నారు. అసలు వారికి నిబంధనల గురించి అవగాహన ఉందా అని ప్రశ్నించారు.  నిబంధనల గురించి తెలిస్తే పూర్తి విషయం తెలుస్తుందన్నారు. దాని కోసం వారు ఐటీఎఫ్ రూల్స్ బుక్ ని పరిశీలించాలని సూచించారు.

Latest Videos

undefined

ఐటీఎఫ్ రూల్స్ ప్రకారం.. రోహన్ బోపన్న అర్హత సాధించలేదని పేర్కొన్నారు. ఇక సానియా మీర్జా చేసిన ట్వీట్ కూడా నిరాధారనమైనదని పేర్కొన్నారు.

అసలు మ్యాటర్ లోకి వెళితే...టోక్యో ఒలంపిక్స్ లో పురుషుల డబుల్స్ విభాగంలో చోటు దక్కకపోవడంపై బోపన్న తీవ్ర ఆవేదన వ్యక్తం చేశాడు. ఈ విషయంలో  ఆల్ ఇండియా టెన్నిస్ అసోసియేషన్ తమను మోసం చేసిందని అన్నాడు.  ఆ విభాగంలో  పోటీపడేందుకు తనకూ, సుమిత్ నగల్ కు అంతర్జాతీయ టెన్నిస్ ఫెడరేషన్ ఎప్పుడూ అనుమతులు ఇవ్వడానికి అంగీకరించలేదని.. కానీ ఏఐటీఏ మాత్రం  ఇంకా తమకు అవకాశం ఉందంటూ చెబుతూ వచ్చిందని పేర్కొన్నాడు.

ఆటగాళ్ల నామినేషన్ ప్రక్రియలో  చివరి తేడీ జూన్ 22 తర్వాత ఎలాంటి మార్పులు ఉండబోవని ఐటీఎఫ్ స్పష్టం చేసిందని.. కానీ తమకింకా ఒలంపిక్స్ లో పాల్గొనే అవకాశం ఉందని ఏఐటీఏ ఆటగాళ్లను, ప్రభుత్వాన్ని, మీడియాను తప్పుదోవ పట్టించారంటూ బోపన్న ట్వీట్ చేశాడు.

అతను చేసిన ట్వీట్ పై సానియా మీర్జా స్పందించింది. బోపన్న చెప్పింది నిజమైతే.. అది చాలా దారుణమైన విషయమని ఆమె అన్నారు. ఇదొక సిగ్గుమాలిన చర్య అంటూ ఆమె ఏఐటీఏపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలా చేయడం వల్ల ఒలంపిక్స్ లో భారత్ ఓ పతకం కోల్పోయిందని మండిపడింది.

కాగా... వీరిద్దరి ట్వీట్స్ పై తాజాగా ఆల్ ఇండియా టెన్నిస్ అసోసియేషన్ వివరణ ఇవ్వడం గమనార్హం. 

click me!