మోకాలు సహకరించని కారణంగా ఒలింపిక్స్ నుంచి తప్పుకుంటున్నట్టు స్విస్ దిగ్గజం రోజర్ ఫెదరర్ ప్రకటించాడు.
టెన్నిస్ దిగ్గజం రోజర్ ఫెదరర్ ఒలింపిక్స్ నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించాడు. జులై 23 నుండి ప్రారంభమవనున్న ఒలింపిక్స్ లో తన మోకాలు ఇబ్బంది పెడుతున్నందున తాను ఒలింపిక్స్ నుండి తప్పుకుంటున్నట్టు ఒక ప్రకటనలో తెలిపాడు.
గ్రాస్ కోర్ట్ సీజన్లో తన మోకాలు తనను ఇబ్బంది పెడుతున్నా విషయాన్ని గ్రహించినందున తాను ఒలింపిక్స్ నుండి తప్పుకోవాలని నిర్ణయాన్ని తీసుకున్నట్టు తెలిపాడు ఈ స్విస్ దిగ్గజం. స్విట్జర్లాండ్ తరుఫున ఆడిన ప్రతిసారి చాలా గర్వంగా ఉంటుందని, కానీ ఈసారి ఆడకపోవడం బాధ కలిగిస్తుందని తెలిపాడు ఈ స్విస్ మాస్ట్రో.
undefined
ఇప్పటికే తాను రీహాబిలిటేషన్ లో ఉన్నయ్, త్వరలోనే అది పూర్తి చేసుకొని శీతాకాలానికి ముందు తిరిగి టెన్నిస్ కోర్టులో అడుగుపెడతానని తెలిపాడు స్విస్ స్టార్. ఒలింపిక్స్ లో పాల్గొంటున్న స్విస్ టీం కి ఆల్ ది బెస్ట్ చెబుతూ... తాను దూరం నుంచే అందరి కోసం చీర్ చేస్తానని తెలిపాడు.
20 సార్లు గ్రాండ్ స్లాం ఛాంపియన్ గా నిలిచినా ఫెదరర్... గత కొంత కాలంగా మోకాలి సంబంధిత సమస్యలతో బాధపడుతున్నాడు. 2020లో ఏకంగా రెండు సార్లు మోకాలికి శస్త్రచికిత్స కూడా చేయించుకున్నాడు.
వింబుల్డన్ లో మెరుగైన ప్రదర్శన చేయడం కోసం ఫ్రెంచ్ ఓపెన్ నుంచి కూడా తప్పుకున్న ఫెదరర్... గ్రాస్ కోర్టులో నిరాశపరిచాడు. క్వార్టర్ ఫైనల్స్ లోనే వెనుదిరిగి అభిమానులకు తీవ్ర నిరాశను మిగిల్చాడు.
2012 ఒలింపిక్స్ లో సింగిల్స్ లో సిల్వర్ మెడల్ గెల్చిన ఫెదరర్... 2008 ఒలింపిక్స్ లో డబుల్స్ గోల్డ్ ని సాధించాడు. త్వరలో 40వ పడిలోకి అడుగుపెడుతున్న ఫెదరర్ ఇక తరువాతి ఒలింపిక్స్ లో ఆడే అవకాశాలు లేనందున అతని సింగిల్స్ ఒలింపిక్ స్వర్ణం కలగానే మిగిలిపోనుంది.
ఫెదరర్, నాదల్ ఇద్దరు కూడా ఒలింపిక్స్ నుంచి తప్పుకోవడంతో... ఇక ఒలింపిక్స్ లో జకోవిచ్ హాట్ ఫేవరెట్ గా కనబడుతున్నాడు. ఇప్పటికే ఆస్ట్రేలియన్ ఓపెన్,ఫ్రెంచ్ ఓపెన్, వింబుల్డన్ లను గెలిచి ఊపుమీదున్న జోకర్ ఒలింపిక్స్ లో గోల్డ్ కొట్టి గోల్డెన్ గ్రాండ్ స్లామ్ రికార్డు దిశగా దూసుకుపోయేలా కనబడుతున్నాడు.