Taipei Open 2022: కశ్యప్ ముందంజ.. మిక్స్డ్ డబుల్స్‌లో భట్నాగర్-తనీషా క్వార్టర్స్‌కు.. మిగతా వాళ్లంతా ఇంటికే

Published : Jul 21, 2022, 06:04 PM IST
Taipei Open 2022:  కశ్యప్ ముందంజ.. మిక్స్డ్ డబుల్స్‌లో భట్నాగర్-తనీషా క్వార్టర్స్‌కు.. మిగతా వాళ్లంతా ఇంటికే

సారాంశం

Taipei Open 2022:  తైపీ ఓపెన్‌లో రెండో రౌండ్ కు చేరుకున్న పలువురు భారత ఆటగాళ్ల పోరాటం ఇక్కడే ఆగిపోయింది. పురుషుల సింగిల్స్ లో కశ్యప్ ఒక్కడే ముందంజ వేశాడు. 

తైవాన్ వేదికగా జరుగుతున్న తైపీ ఓపెన్‌లో భారత్ కు షాక్ తగిలింది. పురుషుల సింగిల్స్ లో తొలి రౌండ్ గండం దాటిన భారత బృందం రెండో రౌండ్ లో తడబడింది. పురుషుల సింగిల్స్ లో మూడో సీడ్ పారుపల్లి కశ్యప్ మినహా మిగిలినవారంతా నిష్క్రమించారు. రెండో రౌండ్ కు చేరిన మిథున్ మంజునాథన్, ప్రియాన్షు రజవత్, కిరణ్ జార్జ్ లు ఆ గండాన్ని దాటలేకపోయారు. ఇక మహిళల సింగిల్స్ లో ఏకైక ఆశాకిరణం సమియా ఫరూఖీ కూడా ఓడింది. 

పురుషుల సింగిల్స్ లో భాగంగా జరిగిన రెండో రౌండ్ మ్యాచ్ లో తైవాన్ కు చెందిన లి చియా హోతో తలపడిన కశ్యప్.. అతడిని ఓడించి క్వార్టర్స్ కు దూసుకెళ్లాడు.  రెండో రౌండ్ లో కశ్యప్.. 21-10, 21-19 తేడాతో లి చియా ను ఓడించాడు. 51 నిమిషాల్లో ముగిసిన ఈ మ్యాచ్ లో ఆది నుంచి ఆధిపత్యం చెలాయించిన కశ్యప్.. క్వార్టర్స్ కు చేరాడు.  

మహిళల సింగిల్స్ లో రెండో రౌండ్ కు చేరిన భారత ఏకైక క్రీడాకారిణి సమియా ఫరూఖీ. . తైవాన్ కే చెందిన వెన్ చి చేతిలో ఓడింది. సమియా.. 18-21, 13-21 తో ఓటమిపాలైంది. 

 

మెన్స్ డబుల్స్ లో రెండో రౌండ్ కు చేరిన భట్నాగర్-ప్రతీక్ జోడీ తైవాన్ కే చెందిన యాంగ్-చి లిన్  చేతిలో ఓడింది. అర్జున్-కపిల్ ల జోడీ  మ్యాచ్ నేటి రాత్రి జరగాల్సి ఉంది.

మిక్స్డ్ డబుల్స్ లో  భట్నాగర్-తనీషా క్రాస్టోల జోడీ రెండో రౌండ్ లో 21-14, 21-17 తేడాతో కై వెన్-యు కియా జోడీని మట్టికరిపించి క్వార్టర్స్ కు దూసుకెళ్లింది. 

 

PREV
click me!

Recommended Stories

యూఎస్ ఓపెన్ 2025 ఫైనల్: సబాలెంకా vs అనిసిమోవా.. ఎవరు ట్రోఫీ గెలుస్తారు?
Vece Paes: లియాండర్‌ పేస్‌కు పితృవియోగం.. ఒలింపియన్ వేస్ పేస్ కన్నుమూత