Daria Kasatkina: స్వలింగ సంపర్కంపై రష్యన్ టెన్నిస్ స్టార్ సంచలన వ్యాఖ్యలు.. తాను లెస్బియన్ అంటూ..

Published : Jul 19, 2022, 03:39 PM IST
Daria Kasatkina: స్వలింగ సంపర్కంపై రష్యన్ టెన్నిస్ స్టార్ సంచలన వ్యాఖ్యలు.. తాను లెస్బియన్ అంటూ..

సారాంశం

Russia: రష్యాలో నెంబర్ వన్ టెన్నిస్ ర్యాంకర్ అయిన డారియా కసట్కిన స్వలింగ సంపర్కం, హోమో సెక్సువాలిటీ పై ఆమె స్వదేశం అనుసరిస్తున్న విధానాలపై ఆసక్తకిర వ్యాఖ్యలు చేసింది.   

ప్రపంచ మహిళల టెన్నిస్ లో 12 వ  ర్యాంకర్, రష్యాలో నెంబర్ వన్ టెన్నిస్ స్టార్  అయిన డారియా కసట్కిన.. LGBTQ, homosexuality పై రష్యా అనుసరిస్తున్న విధానాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. తాను లెస్బియన్ అని ప్రకటించుకుని అందరికీ షాకచ్చింది.  రష్యా ఇటీవలే ప్రజా సముదాయాల్లో సాంప్రదాయేతర లైంగిక సంబంధాలపై  సమాచారాన్ని నిషేధించే కొత్త ప్రతిపాదనను తీసుకొచ్చింది.  దీంతో దేశంలో స్వలింగ  సంపర్కులు కన్నెర్రజేశారు. 

తాజాగా ఇదే విషయమై కసట్కినా ఓ యూట్యూబ్ ఛానెల్ లో మాట్లాడుతూ.. ‘రష్యాలో ఇంతకంటే ముఖ్యమైన అంశాలెన్నో నిషేధించడానికి ఉన్నాయి. అయితే  ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయమేమీ షాకింగ్ గా అనిపించలేదు..

వాళ్లు (రష్యా  ప్రభుత్వం) చెప్పినట్టు మీ భాగస్వామితో గదిలోనే జీవించడం, బయట మాట్లాడకపోవడం అనేదాంట్లో అర్థం లేదు. మీరు దాని గురించి మాట్లాడుకోవాల్సి వస్తే అది మీ ఇష్టం. ఏం చెప్పాలి..? ఏం చెప్పకూడదు అనేది వ్యక్తులకు సంబంధించిన విషయం...’అని తెలిపింది. 

 

ఇదే విషయమై రష్యన్ ఫుట్బాల్ క్రీడాకారిణి  నడ్య కరపోవా కూడా గతవారం  కసట్కినా వెల్లడించిన అభిప్రాయాలనే వెలిబుచ్చింది. దీనికి కసట్కినా స్పందిస్తూ.. ‘కరపోవా ఈ విషయంలో మాట్లాడినందుకు చాలాసంతోషం. కానీ  ఇంకా చాలా మంది మాట్లాడాలి. ముఖ్యంగా  అమ్మాయిలు దీని మీద గళం వినిపించాలి. ఇలాంటి సందర్భాల్లో యువతకు మద్దతు కావాలి.. మరీ ముఖ్యంగా క్రీడలలో ఉండే  వ్యక్తులు చాలామందిని ప్రభావితం చేయగలుగుతారు. వాళ్ల ఈ సమస్య గురించి విరివిగా మాట్లాడాలి..’ అని కోరింది. 

యూట్యూబ్ లో తన అభిప్రాయాలు వెల్లడించిన తర్వాత కసట్కినా తాను లెస్బియన్  అన్న విషయాన్ని ట్విటర్ వేదికగా  ప్రకటించింది. రష్యన్ స్కేటింగ్ క్రీడాకారిణి నటాలియా జబైకో తో కలిసి ఉన్న ఫోటోను పంచుకుంటూ  ‘మై క్యూటీ పై’ అని పోస్ట్ పెట్టి అందరినీ ఆశ్చర్యంలో ముంచింది. 
 

PREV
click me!

Recommended Stories

యూఎస్ ఓపెన్ 2025 ఫైనల్: సబాలెంకా vs అనిసిమోవా.. ఎవరు ట్రోఫీ గెలుస్తారు?
Vece Paes: లియాండర్‌ పేస్‌కు పితృవియోగం.. ఒలింపియన్ వేస్ పేస్ కన్నుమూత