Taipei Open 2022: కశ్యప్, మిథున్ ముందుకు.. మాళవిక ఇంటికి.. తైపీ ఓపెన్ లో భారత్ కు మిశ్రమ ఫలితాలు..

Published : Jul 20, 2022, 05:39 PM IST
Taipei Open 2022: కశ్యప్, మిథున్ ముందుకు.. మాళవిక ఇంటికి..  తైపీ ఓపెన్ లో భారత్ కు మిశ్రమ ఫలితాలు..

సారాంశం

Taipei Open 2022: తైవాన్ వేదికగా జరుగుతున్న తైపీ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీలో తొలి రోజు భారత్ కు మిశ్రమ ఫలితాలు వచ్చాయి. పారుపల్లి కశ్యప్, మిథున్ మంజునాథ్ లు రెండో రౌండ్ కు ముందంజ వేశారు.

భారత స్టార్ షట్లర్ పారుపల్లి కశ్యప్ తైపీ ఓపెన్ లో రెండో రౌండ్ కు చేరాడు. తైవాన్ వేదికగా జరుగుతున్న తైపీ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీలో భారత జట్టుకు తొలి రోజు మిశ్రమఫలితాలు దక్కాయి.  పారుపల్లి కశ్యప్ తో పాటు  కిరణ్ జార్జ్, మిథున్ మంజునాత్, ప్రియాన్షు  రజవత్ లు  ముందంజ వేయగా  మాళవికి బన్సోద్  తొలి రౌండ్ లోనే ఇంటి బాట పట్టింది. సింగిల్స్ తో పాటు డబుల్స్, మిక్స్డ్ డబుల్స్ లో కూడా భారత్ కు మంచి ఫలితాలే వచ్చాయి. 

పురుషుల సింగిల్స్ లో భాగంగా జరిగిన క్వాలిఫైయర్ మ్యాచ్ లో  పారుపల్లి కశ్యప్ 24-22, 21-10 తేడాతో చి యు జెన్ ను ఓడించాడు.  కిరణ్ జార్జ్ 23-21,  21-17 తేడాతో ద్విచాయోపై  నెగ్గాడు. 

వీరితో పాటు మిథున్ మంజునాథన్..  21-17, 21-15 తేడాతో కిమ్ జంగ్  బ్రూన్  ను మట్టికరిపించాడు. మరో పోటీలో ప్రియాన్షు  రజవత్.. 21-16, 21-15 తేడాతో యు షెంగ్ పో కు చుక్కులు చూపించి రెండో రౌండ్ కు దూసుకెళ్లాడు. 

ఇక మహిళల సింగిల్స్ లో మాళవిక బన్సోద్ ఓటమి చవిచూసింది. ఆమె 21-10, 15-21, 14-21 తో లియాంగ్ టింగ్ యు చేతిలో ఓడింది.  కిసోనా సెల్వదురై కూడా సమియా ఫరూఖీ చేతిలో ఓటమిపాలైంది. 

 

ఇక పురుషుల డబుల్స్ లో భారత జోడీ  అర్జున్-కపిల  లు 21-19, 21-23, 21-12 తేడాతో లి యు-సు లివెయ్ ని ఓడించారు.  ఇషాన్ బట్నాగర్-కృష్ణప్రసాద్ ల జోడీ.. 26-24, 14-21, 21-19 తేడాతో యార్డ్ ఫయిసంగ్-చారోఎంకిటామోర్న్ లపై గెలిచారు.  కానీ రవికృష్ణ-ఉదయ్ కుమార్ లతో పాటు  గర్గా-పంజలా జోడీలు తొలి రౌండ్ లోనే నిష్క్రమించాయి. 

 

మిక్స్డ్ డబుల్స్ లో ఇషాన్ బట్నాగర్-తానిషా క్రాస్టో ల జోడీ..  స్వెట్లన జిల్బర్మెన్-మిషా జిల్మర్మన్ లను ఓడించి ప్రీ క్వార్టర్స్ కు చేరుకుంది.  

PREV
click me!

Recommended Stories

యూఎస్ ఓపెన్ 2025 ఫైనల్: సబాలెంకా vs అనిసిమోవా.. ఎవరు ట్రోఫీ గెలుస్తారు?
Vece Paes: లియాండర్‌ పేస్‌కు పితృవియోగం.. ఒలింపియన్ వేస్ పేస్ కన్నుమూత