నువ్వు ఎంతో మందికి ఆదర్శం... సానియా పై షోయబ్

Published : Jan 28, 2023, 09:01 AM IST
నువ్వు ఎంతో మందికి ఆదర్శం... సానియా పై షోయబ్

సారాంశం

ఆమె భర్త షోయబ్ మాలిక్ అండగా నిలిచాడు. సానియా ఎంతో మందికి ఆదర్శమంటూ ఆయన ట్విట్టర్ లో పేర్కొన్నారు.

టెన్నిస్ తార సానియా మీర్జా...తన గ్రాండ్ స్లామ్ ప్రయాణాన్ని ముగించిన సంగతి తెలిసిందే. కాగా... చివరి గ్రాండ్ స్లామ్ లో ఆమె ఓటమిపాలయ్యారు. చివరి మ్యాచ్ ఓడిపోవడంతో ఆమె కన్నీటి పర్యంతమయ్యారు. ఆస్ట్రేలియా ఓపెన్ మిక్స్ డ్ డబుల్స్ లో ఫైనల్స్ వరకూ వెళ్లి పరాజయం చెందడంతో... ఆమె తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. దీంతో.... ఆమె భర్త షోయబ్ మాలిక్ అండగా నిలిచాడు. సానియా ఎంతో మందికి ఆదర్శమంటూ ఆయన ట్విట్టర్ లో పేర్కొన్నారు.

 

సానియా ఎంతో మందికి ఆదర్శమని... ఆమెను చూసి తాను ఎంతో గర్వపడుతున్నానంటూ ఆయన ట్విట్టర్ లో పేర్కొన్నాడు.

‘ క్రీడారంగంలోకి అడుగుపెట్టాలని అనుకునేవారందరినీ నువ్వు ఒక ఆదర్శం.  నువ్వు కెరీర్ లో సాధించిన ప్రతి దానికీ నేను ఎంతో గర్వ పడుతున్నాను. నిన్ను చూసి చాలా మంది స్పూర్తి పొందుతారు. ఎప్పుడూ బలంగా ఉండు. నీ అత్యుత్తమ కెరీర్ కి అభినందనలు’ అంటూ షోయబ్ ట్వీట్ చేశాడు.  ఈ ట్వీట్ సానియా అభిమానులను ఆకట్టుకుంటోంది.

PREV
click me!

Recommended Stories

PV Sindhu: జపాన్ ఓపెన్ హిస్టరీలో ఫస్ట్ ఇండియన్.. పీవీ సింధు మైండ్ బ్లోయింగ్ విక్టరీ
Wimbledon White Dress Code: వింబుల్డన్‌లో వైట్ డ్రెస్సే ఎందుకు? టెన్నిస్ ప్లేయర్స్ 150 ఏళ్లుగా ఫాలో అవుతున్న వింత రూల్ !