Ostrava Open: ఫైనల్స్ కు దూసుకెళ్లిన సానియా మీర్జా-షుమె జాంగ్ ద్వయం

Published : Sep 25, 2021, 05:52 PM ISTUpdated : Sep 25, 2021, 06:00 PM IST
Ostrava Open: ఫైనల్స్ కు దూసుకెళ్లిన సానియా మీర్జా-షుమె జాంగ్ ద్వయం

సారాంశం

Ostrava Open: ఒస్ట్రావా ఓపెన్ డబ్ల్యూటీఏ-500  టెన్నిస్ టోర్నీలో భారత టెన్నిస్ క్రీడాకారిణి సానియా మీర్జా-షుమె జాంగ్ (చైనా) ల జోడి ఫైనల్లోకి ప్రవేశించింది. 

భారీ టోర్నీల్లో క్వాలిఫైయర్, క్వార్టర్స్ మ్యాచ్ లలోనే వెనుదిరిగే భారత టెన్నిస్ సంచలనం సానియా మీర్జా (sania mirza) ఒస్ట్రావా ఓపెన్ లో  ఆ అడ్డంకిని విజయవంతంగా అధిగమించింది. చైనా  టెన్నిస్ క్రీడాకారిణి షుమె జాంగ్ (Shuai Zhaung) తో కలిసి ఆడుతున్న ఆమె.. ఒస్ట్రావా ఓపెన్ టెన్నిస్ టోర్నీలో ఫైనల్లోకి ప్రవేశించింది. 

 

సానియా మీర్జా-షుమె జాంగ్ ల ద్వయం.. శనివారం చెక్ రిపబ్లిక్ లో జరిగిన సెమీఫైనల్ మ్యాచ్ లో  ఎరి హజుమి-మకొటొ నినొమియా (జపాన్) జంటపై ఘన విజయం సాధించింది. మహిళల డబుల్స్ లో భాగంగా సానియా జోడీ 6-2, 7-5  తేడాతో హజుమి జోడీని మట్టికరిపించింది. వరుస సెట్లలో ప్రత్యర్థికి చుక్కలు చూపించిన సానియా ద్వయం దర్జాగా ఫైనల్లోకి ప్రవేశించింది.

PREV
click me!

Recommended Stories

యూఎస్ ఓపెన్ 2025 ఫైనల్: సబాలెంకా vs అనిసిమోవా.. ఎవరు ట్రోఫీ గెలుస్తారు?
Vece Paes: లియాండర్‌ పేస్‌కు పితృవియోగం.. ఒలింపియన్ వేస్ పేస్ కన్నుమూత