కరోనా కారణంగా పూట గడువని పరిస్థితుల్లో కొట్టుమిట్టాడుతున్నకుటుంబాలను ఆదుకునేందుకు రూ. కోటి 25 లక్షలు సేకరించింది. వీటి ద్వారా అన్నార్థులకు సహాయం చేయనుంది. ఈ విషయాన్ని తన ట్విట్టర్ ద్వారా వెల్లడించింది.
కరోనా మహమ్మారి ప్రపంచ దేశాలను వణికిస్తోంది. ఈ వైరస్ పై పోరాడటానికి భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా ముందుకొచ్చింది. కరోనా కారణంగా పూట గడువని పరిస్థితుల్లో కొట్టుమిట్టాడుతున్నకుటుంబాలను ఆదుకునేందుకు రూ. కోటి 25 లక్షలు సేకరించింది. వీటి ద్వారా అన్నార్థులకు సహాయం చేయనుంది. ఈ విషయాన్ని తన ట్విట్టర్ ద్వారా వెల్లడించింది.
Also Read కరోనా లాక్‌డౌన్: తల్లిసేవలో జస్ప్రీత్ బుమ్రా, రెండుసార్లు ఫ్లోర్ క్లీనింగ్...
‘కొవిడ్-19 వైరస్‌తో తినడానికి తిండి లేకుండా రోడ్డున పడ్డ వారి కోసం ఏమన్న చేయాలన్న తలంపుతో ఒక గ్రూపుగా ఏర్పడ్డాం. వారం వ్యవధిలో కోటి 25 లక్షలతో వేల కుటుంబాలకు అన్నదానం చేయనున్నాం. ఈ డబ్బుతో దాదాపు లక్ష మందికి సహాయం అందుతుంది. దీన్ని మేమందరం కలిసి ఇంకా కొనసాగిస్తాం. @యూత్‌ఫీడ్ఇండియా @సేఫ్ఇండియా’ అంటూ సానియా ట్వీట్ చేసింది. కరోనా వైరస్‌పై పోరాటంలో పలువురు క్రీడాకారులు విరాళాలు ప్రకటిస్తూనే ఉన్నారు.