టెన్నిస్ సూపర్ స్టార్ మారియా షరపోవా సంచలన నిర్ణయం తీసుకున్నారు. టెన్నిస్ క్రీడకు వీడ్కోలు పలుకుతూ ,షరపోవా తీవ్రమైన భావోద్వేగానికి గురయ్యారు. తనకు తెలిసిన జీవితం ఒక్కటే ఒక్కటని అన్నారు.
మాస్కో: టెన్నిస్ స్టార్ మారియా షరపోవా ఆటకు గుడ్ బై చెప్పేశారు. 32 ఏళ్ల షరపోవా తాను ప్రొఫెషనల్ టెన్నిస్ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. ఐదు సార్లు గ్రాండ్ స్లామ్ టైటిళ్లు గెలుచుకున్న షరపోవా తన రిటైర్మెంట్ ను ప్రకటిస్తూ భావోద్వేగానికి గురయ్యారు.
మనకు తెలిసిన ఒకే ఒక జీవితం ఎలా వదులుకోవాలంటూ ఆమె ఆవేదనకు గురయ్యారు. చిన్నప్పటి నుంచి ఆడుతున్న టెన్నిస్ కోర్టుకు దూరంగా ఎలా వెళ్లగలమని ప్రశ్నించుకున్నారు. చెప్పుకోలేని దుఖ్కాలు, మాటల్లో వర్ణించలేని ఆనందాలను టెన్నిస్ ఇచ్చిందని చెప్పారు.
undefined
ఈ ఆట తనకో కుటుంబాన్ని ఇచ్చిందని, 28 ఏళ్ల పాటు తన వెంట నడిచే అభిమానులను అందించిందని ఆమె అన్నారు. ఈ ఆటను ఎలా వదలాలని ప్రశ్నించుకున్నారు. ఇది చాలా బాధాకరమని చెప్పారు. టెన్నిస్... ఇక గుడ్ బై అని అన్నారు.
ఓ అంతర్జాతీయ మ్యాగజైన్ లో తన వీడ్కోలుకు సంబంధించిన విషయాలను రాశారు. 2004లో కేవలం 14 ఏళ్ల వయస్సులోనే షరపోవా వింబుల్డన్ చాంపియన్ షిప్ గెలిచి సంచలనం సృష్టించారు. ఆ తర్వాత 2006లో యూఎస్ ఓపెన్, 2008లో ఆస్ట్రేలియన్ ఓపెన్ గెలిచి రికార్డులు సృష్టించారు. 2012, 2014ల్లో జరిగిన ఫ్రెంచ్ ఓపెన్ టోర్నమెంట్లలో షరపోవా తన కేరీర్ లోనే అత్యుత్తమైందనే ప్రశంసలు అందుకుంది.