ఎలాగైనా సరే.. ఆమె రికార్డును సమయం చేయాలని సెరెనా రెండేళ్లుగా శ్రమిస్తూనే ఉంది. కానీ.. ఏదో ఒక కారణణంగా ఆమె అది సాధించలేకపోతోంది.
అమెరికా టెన్నిస్ తార సెరెనా విలియమ్స్ కి మరోసారి తీవ్ర నిరాశ ఎదురైంది. అభిమానుల సమక్షంలో కన్నీరు పెట్టుకుంటూ.. ఆమె వింబుల్డన్ నుంచి వెనుదిరిగింది. గాయం కారణంగా సెరెనా వింబుల్డన్ నుంచి తొలి రౌండ్ లోనే తప్పుకోవడం గమనార్హం.
టెన్నిస్ లో అత్యధిక గ్రాండ్ స్లామ్ లు కైవసం చేసుకున్న క్రీడాకారిణి సెరెనా విలియమ్స్ కావడం గమనార్హం. ఇప్పటి వరకు 23 గెలుచుకుంది. అయితే.. ఆల్ టైం అత్యధిక గ్రాండ్ స్లామ్ ల రికార్డు మార్గరెట్ కోర్ట్ పేరుతో ఉంది. ఆమె 24 గెలిచింది. ఎలాగైనా సరే.. ఆమె రికార్డును సమయం చేయాలని సెరెనా రెండేళ్లుగా శ్రమిస్తూనే ఉంది. కానీ.. ఏదో ఒక కారణణంగా ఆమె అది సాధించలేకపోతోంది.
undefined
ఈసారి వింబుల్డన్ పై ఆమె ఎన్నో ఆశలు పెట్టుకుంది. అనూహ్యంగా గాయం కారణంగా నిష్ర్కమించక తప్పలేదు. మంగళవారం ఆమె సెంటర్ కోర్టులో అలియక్ సాండ్ర ససనోవిచ్ తో తలపడింది. ఐదో గేమ్ లో సర్వీస్ చేస్తుండగా.. బేస్ లైన్ వద్ద ఆమె కాలు బెనికింది. పాయింట్ల మధ్య నొప్పితో విలవిల్లాడింది. ఆ గేమ్ ముగియగానే మెడికల్ టైమ్ ఔట్ తీసుకొని ఆటను కొనసాగించింది.
నొప్పికి తట్టుకోలేక విలియమ్స్ పళ్లు బిగపట్టిమరీ కన్నీరు పెట్టుకున్నారు. ముఖానికి చేతులు అడ్డుపెట్టుకొని ఏడ్చేసిందిద. ఆ సమయంలో ఆమెకు అభిమానులు అండగా నిలిచారు. అరుపులతో ఆమెను ప్రోత్సహించారు. చివరకు నొప్పిని భరించలేక మైదానంలోనే ఆమె కుప్పకూలిలంది. తర్వాత ప్రత్యర్థికి షేక్ హ్యాండ్ ఇచ్చి.. కన్నీటితో ఆమె మైదానం వీడారు.