Sania Mirza: ఫైనల్లో సానియా సంచలనం.. ఈ ఏడాది తొలి టైటిల్ సాధించిన హైదరాబాదీ

Published : Sep 26, 2021, 06:46 PM ISTUpdated : Sep 26, 2021, 06:57 PM IST
Sania Mirza: ఫైనల్లో సానియా సంచలనం.. ఈ ఏడాది తొలి టైటిల్ సాధించిన హైదరాబాదీ

సారాంశం

Ostrava Open: హైదరాబాదీ టెన్నిస్ స్టార్ సానియా మీర్జా సంచలనం సృష్టించింది.  ఒస్ట్రావా ఓపెన్ టోర్నీ మహిళల డబుల్స్ విభాగంలో పోటీ పడుతున్న సానియా ఈ ఏడాది తొలి  టైటిల్ ను గెలుచుకుంది.

భారత స్టార్ టెన్నిస్ ప్లేయర్ సానియా మీర్జా సంచలనం సృష్టించింది. చెక్ రిపబ్లిక్ వేదికగా జరుగుతున్న ఒస్ట్రావా ఓపెన్ మహిళల డబుల్స్ టైటిల్ ను ఆమె నెగ్గింది. ఆదివారం జరిగిన ఫైనల్స్ లో సానియా మీర్జా - షుయ్ జాంగ్ (చైనా)ల జోడీ 6 3, 6 2 తో క్రిస్టియన్ (అమెరికా) ఎరిన్ రూట్లైఫ్ (న్యూజీలాండ్)ను ఓడించింది. టైటిల్ ఫేవరేట్ గా బరిలోకి దిగిన సానియా జోడీ రెండు వరుస సెట్లలోనూ  ప్రత్యర్థిని మట్టి కరిపించింది. గంటన్నర పాటు సాగిన ఈ పోరులో సానియా జోడీ.. క్రిస్టియన్ ద్వయానికి  కోలుకునే సమయం ఇవ్వలేదు. 

 

ఈ  సీజన్ లో సానియాకు ఇది రెండో ఫైనల్ కాగా తొలి టైటిల్. గత నెలలో యూఎస్ఏలో జరిగిన క్లీవ్ లాండ్ టోర్నీలో సానియా జాంగ్ ల జోడీ రన్నరప్ తో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఇక డబ్ల్యూటీఏ ఈవెంట్లలో సానియాకు ఇది 43వ టైటిల్ కావడం గమనార్హం. 

PREV
click me!

Recommended Stories

యూఎస్ ఓపెన్ 2025 ఫైనల్: సబాలెంకా vs అనిసిమోవా.. ఎవరు ట్రోఫీ గెలుస్తారు?
Vece Paes: లియాండర్‌ పేస్‌కు పితృవియోగం.. ఒలింపియన్ వేస్ పేస్ కన్నుమూత