Tennis: ఐసీ రాడ్ లేవర్ జూనియర్ టెన్నిస్ ఛాలెంజ్ లో అమెరికాను చిత్తుచేసిన భార‌త్

By Mahesh Rajamoni  |  First Published Nov 9, 2023, 11:51 PM IST

IC Rod Laver Junior tennis: ఐసీ రాడ్ లేవర్ జూనియర్ ఛాలెంజ్ లో ధమ్నే నేతృత్వంలోని భారత్ 5-1తో అమెరికాపై విజయం సాధించింది. డబుల్స్‌లో ఆడిన రెండు మ్యాచ్‌ల్లోనూ భారత జట్టు విజయం సాధించింది. 
 


IC Rod Laver Junior Challenge: మానస్ ధమ్నే నేతృత్వంలోని జూనియర్ భారత జట్టు ఐసీ రాడ్ లేవర్ జూనియర్ ఛాలెంజ్ లో ఆతిథ్య అమెరికాపై 5-1 తేడాతో విజయం సాధించింది. టాటా మహారాష్ట్ర ఓపెన్ లో ప్ర‌త్యేక చాటుకున్న ధమ్నే తొలి బాలుర సింగిల్స్ లో 6-1, 6-2తో స్టైల్స్ బ్రోకెట్ పై, ఆ తర్వాత రుషీల్ ఖోస్లా జోనా హిల్‌పై 6-4, 6-3తో విజయం సాధించాడు. తొలి బాలికల సింగిల్స్ లో అస్మీ అడ్కర్ 4-6, 5-7తో శివానీ సెల్వన్ చేతిలో ఓడిపోగా, సోహ్ని మొహంతి 7-6(1), 6-0తో రీలీ రోడ్స్ పై విజయం సాధించింది.

బాలుర డబుల్స్, బాలికల డబుల్స్ రెండింటిలోనూ భారత్ విజయం సాధించింది. 'ఇది తీవ్రమైన పోటీ, బ‌ల‌మైన ప్ర‌ద‌ర్శ‌న‌లు ఇచ్చిన రోజు. భారత ఆటగాళ్లు తమ సర్వశక్తులు ఒడ్డారు. మ్యాచ్ లు ముగిసిన త‌ర్వాత మా ఆటగాళ్లు కాలేజీ కోచ్ ల‌తో ముచ్చటించారు, బీచ్ లో బార్-బీ-క్యూను ఎంజాయ్ చేశారు' అని భారత కెప్టెన్ విక్రమ్ ఆనంద్ అన్నారు.

Latest Videos

undefined

అంత‌కుముందు, తొలి మ్యాచ్ లో గ్రేట్ బ్రిటన్ ను 4-2 తేడాతో ఓడించింది. కాలిఫోర్నియాలోని శాన్ డియాగోలోని లా జొల్లా బీచ్ అండ్ టెన్నిస్ క్లబ్ లో జరిగిన ఐసీ రాడ్ లావర్ జూనియర్ ఛాలెంజ్ ఫైనల్స్ తొలి లీగ్ మ్యాచ్ లో మానస్ ధమ్నే, రుషిల్ ఖోస్లా సింగిల్స్, డబుల్స్ మ్యాచ్ విజ‌యాల‌తో బ్రిటన్ పై భారత్ 4-2 తేడాతో పైచేయి సాధించింది. సింగిల్స్ లో బ్రూక్ బ్లాక్ చేతిలో అస్మీ అడ్కర్ ఓడిపోగా, సోహిని మొహంతి తన సింగిల్స్ మ్యాచ్ లో మరియా ఉస్టిక్ పై గెలిచి భారత్ కు నాలుగో విజయాన్ని అందించింది. దీంతో బాలికల డబుల్స్ కు ముందు పోటీ ముగిసింది.

రౌండ్ రాబిన్ ఫార్మాట్ లోని ఇతర మ్యాచ్ ల్లో దక్షిణాఫ్రికా అర్జెంటీనాను, ఇటలీ ఆతిథ్య అమెరికాను ఓడించాయి. బ్రిటన్‌ను 4-2తో ఓడించిన భారత్.. మూడో లీగ్ మ్యాచ్‌లో ఇటలీతో ఆడేందుకు డ్రా చేసుకుంది. ఇటలీ కూడా అమెరికా, అర్జెంటీనాలపై ఆడిన రెండు మ్యాచ్‌ల్లో విజయం సాధించింది.

click me!